
హైదరాబాద్: బాహుబలి సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్నాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ప్రస్తుతం సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న `సాహో` సినిమాతోనూ, `జిల్` ఫేమ్ రాధాకృష్ణ తెరకెక్కిస్తున్న మరో సినిమాతోనూ చాలా బిజీగా ఉన్నాడు.
పెళ్లికూతురు ఎవరో తెలుసా…
టాలీవుడ్ లో ఉన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లలో మొదటి స్థానం లో ఉంటాడు. దీనితో ఇప్పటికే ప్రభాస్ పెళ్లి పై రకరకాల పుకార్లు వచ్చాయి. ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న రెండు సినిమాలు విడుదలై పోయిన తర్వాత ప్రభాస్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడని సమాచారం. ఈ మేరకు ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు భార్య శ్యామలా దేవి ఓ ఇంటర్వ్యూలో హింట్ ఇచ్చారు.
ప్రభాస్ పెళ్లి గురించి వస్తున్న వార్తలపై ఆమె స్పందిస్తూ…ప్రభాస్ పెళ్లి గురించి వస్తున్న వార్తలను మేం పట్టించుకోం. వాటిని చూసి మేం కూడా సరదాగా నవ్వుకుంటాం. ప్రభాస్ పెళ్లి గురించి మాకు కూడా తొందరగానే ఉంది. కానీ, పెళ్లి గురించి అడిగితే.. ఆ రెండు సినిమాలు అయిపోయాక మాట్లాడుకుందాం అంటుంటాడు. త్వరలోనే ఆ రెండు సినిమాలు పూర్తవుతున్నాయి. సాధ్యమైనంత త్వరలోనే పెళ్లి కబురు చెబుతామని శ్యామలా దేవి చెప్పారు.
చదవండి: ఇదే నా చివరి పోటీ … ఇక అంతా మీ చేతుల్లోనే!








