
ఢిల్లీ: ఇటీవల వెలువడిన లోక్‌సభ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించిన ఎన్డీయే కూటమి… గురువారం కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. అందులో భాగంగా ఈ సాయంత్రం 7 గంటలకు ఢిల్లీలో మోడీ రెండోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.
ఇక ఆయనతో పాటు మరికొందరు ఎంపీలు కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేయనున్నట్టు సమాచారం. ప్రమాణస్వీకారానికి కంటే ముందుగా మోడీ నివాసంలో నూతన కేబినెట్ సమావేశం జరగనుంది.
కొత్త మంత్రివర్గ సభ్యులను ఉద్దేశించి మోడీ ప్రసంగం అయ్యాక అక్కడి నుంచి రాష్ట్రపతి భవన్‌కు పయనమవుతారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సమక్షంలో మోడీ ప్రధానిగా, ఇతరులు కేంద్ర మంత్రులుగా ప్రమాణస్వీకారం చేస్తారు.
మోడీ కేబినెట్‌లో ఉండేది వీరే…
అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, స్మృతి ఇరానీ, నితిన్ గడ్కరీ, పియూష్ గోయల్, అబ్బాస్ నఖ్వీ, రవిశంకర్ ప్రసాద్, జితేందర్ సింగ్, రాంవిలాస్ పాశ్వాన్, కిషన్ రెడ్డి, బాబుల్ సుప్రియో, సుష్మా స్వరాజ్, అర్జున్ మేఘ్వాల్, అనుప్రియ, సదానంద గౌడ, ప్రకాశ్ జవదేకర్, నిర్మలా సీతారామన్, సురేశ్ అంగడి, సాధ్వీ నిరంజన్ జ్యోతి, కైలాష్ చౌదరి.








