
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి…ఈరోజు ప్రమాణస్వీకారం చేసిన విషయం తెల్సిందే. విజయవాడ ఇందిరాగాంధి స్టేడియంలో జగన్‌తో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ ప్రమాణ స్వీకారం చేయించారు.
ఈ సందర్భంగా జగన్‌కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లాట్‌లు జగన్‌కి శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే రాష్ట్రపతి తన అధికారిక ట్విట్టర్ ద్వారా జగన్‌ను అభినందించారు. అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్‌ను ఉన్నత శిఖరాలకు జగన్ చేరుస్తారని రాష్ట్రపతి ఆకాంక్షించారు.
అటు వైఎస్ జగన్ కు ప్రధాని మోడీ శుభాకాంక్షలు తెలిపారు. కేంద్రం నుంచి పూర్తిస్థాయిలో సహాయసహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ సరికొత్త ఎత్తుకు చేరుకోవడానికి కలిసి పనిచేద్దామని ఆహ్వానించారు.
ఈరోజు ట్విట్టర్ లో మోదీ స్పందిస్తూ..‘ఏపీ ముఖ్యమంత్రిగా ఎన్నికైన జగన్ కు శుభాకాంక్షలు. కేంద్రం నుంచి ఏపీకి పూర్తి సహాయసహకారాలు అందిస్తామని హామీ ఇస్తున్నా. ఆంధ్రప్రదేశ్ సరికొత్త ఎత్తులకు చేరుకునేందుకు మనం కలసి పనిచేద్దాం’ అని ట్వీట్ చేశారు.
చదవండి: ఏపీ ప్రజలపై వరాల జల్లు కురిపించిన సీఎం జగన్…








