22.8 C
Hyderabad
Saturday, November 7, 2026
- Advertisement -
Home వార్తలు జాతీయం ‘ఆమ్రపాలి’ నన్ను మోసం చేసింది.. సుప్రీం మెట్లెక్కేందుకు సిద్ధమైన ధోనీ

‘ఆమ్రపాలి’ నన్ను మోసం చేసింది.. సుప్రీం మెట్లెక్కేందుకు సిద్ధమైన ధోనీ

- Advertisement -

న్యూఢిల్లీ: ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ ఆమ్రపాలి తనను మోసం చేసిందని టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ ఆరోపించాడు. ఈ మేరకు ఆ సంస్థతో తలెత్తిన వివాదంపై సుప్రీం కోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమయ్యాడు. సంస్థ తనకు చెల్లించాల్సిన రూ.40 కోట్ల బకాయిలతోపాటు రాంచీలోని ఆమ్రపాలి సఫారీలో బుక్ చేసుకున్న పెంట్‌హౌజ్‌కు యాజమాన్య హక్కులు కల్పించలేదని ధోనీ ఆరోపించాడు. అంతేకాక, తనను అర్ధంతరంగా బ్రాండ్ అంబాసిడర్ బాధ్యతల నుంచి తప్పించదని పేర్కొన్నాడు.

2009-2016 మధ్య ఆమ్రాపాలి సంస్థ ధోనీతో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే, ఈ విషయంలో ధోనీకి చెల్లించాల్సిన రూ.40కోట్ల బకాయిలను ఇంతవరకూ ఇప్పటి వరకు చెల్లించలేదు. ఇప్పటికే ఆర్థిక సమస్యల్లో చిక్కుకుని కొట్టుమిట్టాడుతున్న ఆమ్రపాలి సంస్థపై సుప్రంకోర్టులో కేసు నడుస్తోంది. ఆ సంస్థ వద్ద ఇళ్లు కొనుగోలు చేసి మోసపోయిన 46 వేల మంది కోర్టును ఆశ్రయించారు.

కేసును విచారించిన కోర్టు ఆమ్రపాలికి చెందిన ఉప సంస్థలు, డైరెక్టర్ల ఆస్తుల వివరాలు సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. మధ్యలోనే ఆపేసిన పనులను పూర్తి చేయాల్సిన బాధ్యతను తీసుకోవాల్సిందిగా ప్రభుత్వ రంగ సంస్థ అయిన నేషనల్‌ బిల్డింగ్స్‌ కన్‌స్ట్రక్షన్‌ కార్పొరేషన్‌(ఎన్‌బీసీసీ)ను ఆదేశించింది. అలాగే, ఆ సంస్థ సీఎండీ అనిల్‌ శర్మ, ఇద్దరు డైరెక్టర్లు శివ్‌ దీవాని, అజయ్‌ కుమార్‌ను పోలీస్‌ కస్టడీలోకి తీసుకోవాలని ఆదేశించింది.

- Advertisement -