వాహన పత్రాల చెల్లుబాటు గడువును మరోమారు పొడిగించిన కేంద్రం.. ఎప్పటి వరకో తెలుసా?

motor-vehicle-documents-validity-extended-upto-december-31
- Advertisement -

న్యూఢిల్లీ: దేశంలోని మోటారు వాహనాల వినియోగదారులకు శుభవార్త. ఆయా వాహనాలకు సంబంధించిన డ్రైవింగ్ లైసెన్సు తదితర అనుమతి పత్రాల గడువును కేంద్రం మరోమారు పొడిగించింది.

దేశంలో కరోనా లాక్‌డౌన్ కారణంగా కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు డ్రైవింగ్ లైసెన్సు తదితర వాహన పత్రాల అనుమతి గడువును రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ పొడిగిస్తూ వస్తోంది. 

ఇప్పటి వరకు రెండుసార్లు వీటి గడువును పొడిగించగా.. తాజాగా మరోసారి డ్రైవింగ్ లైసెన్సు, రిజిస్ట్రేషన్, ఫిట్‌నెస్ తదితర పత్రాల గడువును డిసెంబర్ 31 వరకు పొడిగించింది.

అయితే ఈ వెసులుబాటు ఈ ఏడాది ఫిబ్రవరి 1 తరువాత.. లేదా డిసెంబర్ 31లోగా గడువు ముగిసే పత్రాలకు మాత్రమే వర్తిస్తుంది. 

ఈ గడువు పెంపు వాహన బీమాకు మాత్రం వర్తించదు. ఆయా వాహనాల వినియోగదారులు వాహన బీమా పత్రాలను మాత్రం రెన్యువల్ చేయించుకోవలసిందేనంటూ జనరల్ ఇన్స్యూరెన్స్ కౌన్సిల్ ఒక ప్రకటనలో పేర్కొంది.

 

- Advertisement -