28.2 C
Hyderabad
Saturday, November 7, 2026
- Advertisement -
Home వార్తలు జాతీయం వచ్చేసిన ‘ఎంఐ 10 యూత్ ఎడిషన్ 5జీ’ .. ఫీచర్లు ఇవిగో!

వచ్చేసిన ‘ఎంఐ 10 యూత్ ఎడిషన్ 5జీ’ .. ఫీచర్లు ఇవిగో!

- Advertisement -

న్యూఢిల్లీ: చైనీస్ మొబైల్ మేకర్ షియోమీ ‘ఎంఐ 10 యూత్ ఎడిషన్ 5జీ’ని లాంచ్ చేసింది. ఫిబ్రవరిలో విడుదల చేసిన ‘ఎంఐ 10’కు మరిన్ని మెరుగులద్ది దీనిని తీసుకొచ్చింది.

ఇందులో వాటర్ డ్రాప్ స్టైల్ నాచ్, స్నాప్‌డ్రాగన్ 765 ఎస్ఓసీ, డ్యూయల్ మోడ్ సస్పెన్షన్ లిక్విడ్ కూలింగ్, వెనకవైపు క్వాడ్ కెమెరా సెటప్, 50 ఎక్స్ జూమ్, 4,160 ఎంఏహెచ్ బ్యాటరీ వంటివి ఇందులో ప్రధాన ఆకర్షణలు. ఈ నెల 30 నుంచి చైనాలో అందుబాటులోకి రానుంది.

ఎంఐ 10 యూత్ ఎడిషన్ 5జీలో పలు ర్యామ్ ఆప్షన్లు ఉన్నాయి. 6జీబీ ర్యామ్+64 జీబీ మోడల్ ధర భారత కరెన్సీలో దాదాపు 22,500, 6జీబీ ర్యామ్+128 జీబీ మోడల్ ధర రూ. 24,700, 8జీబీ ర్యామ్+128 జీబీ ధర సుమారు రూ.26,900, 8జీబీ ర్యామ్+256 జీబీ ఆప్షన్ ధర రూ.30,100. ఇందులో బ్లాక్ స్కిల్ స్టార్మ్, బ్లూబెర్రీ మింట్, ఫోర్ సీజన్స్ స్ప్రింగ్ మిల్క్ గ్రీన్, పీచ్ గ్రేప్‌ఫ్రూట్, వైట్ పీచ్ ఊలోంగ్ కలర్ ఆప్షన్లు ఉన్నాయి.

స్పెసిఫికేషన్లు: 5జీ డ్యూయల్ సిమ్ సపోర్ట్, ఆండ్రాయిడ్ 10 ఆధారిత ఎంఐయూఐ 11 ఆపరేటింగ్ సిస్టమ్, 6.57 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, కార్నింగ్ గ్లాస్ 5 సపోర్ట్, స్నాప్‌డ్రాగన్ 765జి 5జీ ఆక్టాకోర్ ప్రాసెసర్, 8జీబీ ర్యామ్, 256 జీబీ అంతర్గత మెమొరీ, 48 మెగాపిక్సల్‌తో క్వాడ్ కెమెరా సెటప్, 16 ఎంపీ సెల్ఫీ కెమెరా వంటి స్పెసిఫికేషన్లు ఉన్న ఈ స్మార్ట్‌ఫోన్‌లో 4,160 ఎంఏహెచ్ బ్యాటరీని ఉపయోగించారు.

- Advertisement -