
ఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈనెల 4న పశ్చిమ ఢిల్లీలోని మోతీనగర్‌లో ఆప్ చీఫ్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పర్యటించారు. ఆయన ఎన్నికల ప్రచారం చేస్తున్న సమయంలో ఓపెన్ టాప్ జీప్‌పైకి ఎక్కిన ఓ వ్యక్తి కేజ్రీవాల్ చెంప పగలగొట్టిన విషయం తెలిసిందే.
అయితే వెంటనే అతడిని కిందికి ఈడ్చేసిన ఆప్ కార్యకర్తలు చితకబాది పోలీసులకు అప్పగించారు. ఇక దాడి చేసిన వ్యక్తి స్థానిక మెకానిక్ సురేశ్‌గా పోలీసులు గుర్తించారు.
చదవండి: అదొక పార్టీ.. వీళ్లు నాయకులు: వైసీపీ నేతలపై విరుచుకు పడిన యామిని!
ఈ నేపథ్యంలో ఈ ఘటనపై సురేశ్ మీడియాతో మాట్లాడుతూ.. సీఎంను తానెందుకు కొట్టానో అర్థం కావడం లేదని, చేసిన పనికి చింతిస్తున్నట్టు చెప్పాడు. అయితే సీఎంపై దాడి చేయమని ఏ రాజకీయ పార్టీ తనకు చెప్పలేదన్నాడు. అలాగే పోలీసులు తనతో అసభ్యకరంగా ప్రవర్తించలేదని, తాను ఏం తప్పు చేశానో చెప్పారని తెలిపాడు.
ఇదిలా ఉంటే కేజ్రీవాల్ చెంపదెబ్బ తినడం ఇది మొదటి సారి కాదు. 2015లో ఆయనపై తొలిసారి దాడి జరిగింది. ఆ తర్వాత మళ్లీ అదే ఏడాది రెండోసారి ఆయన చెంపదెబ్బ తిన్నారు. ఓ ఆటోవాలా కేజ్రీవాల్ చెంపపై కొట్టాడు.
చదవండి: రాజీవ్‌గాంధీపై పీఎం మోడీ సంచలన వ్యాఖ్యలు! ఖండించిన బీజేపీ సీనియర్ నేత!








