హైదరాబాద్: రాజశేఖర్ ప్రధాన పాత్రలో ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కల్కి’. వైవిధ్యభరితమైన కథాకథనాలతో రూపొందిన ఈ సినిమా నుంచి తాజాగా ట్రైలర్ ఒకటి విడుదల అయింది. హీరో నాని ఈ సినిమా ట్రైలర్‌ని విడుదల చేశారు. ప్రధాన పాత్రలను కవర్ చేస్తూ ఈ ట్రైలర్ ను కట్ చేశారు. యాక్షన్ సన్నివేశాలపై కట్ చేసిన ఈ ట్రైలర్లో రాజశేఖర్ యాక్టింగ్ అదిరిపోయేలా ఉంది.
ట్రైలర్ తో అంచనాలు పెంచేసిన కల్కితో రాజశేఖర్ హిట్ కొట్టడం ఖాయమనే అంటున్నారు. ఇక ట్రైలర్ కూడా ఓ రేంజ్‌లో ఉండటంతో బిజినెస్ కూడా బాగానే జరిగిందని టాక్. ఈ చిత్రానికి ఆంధ్ర అంతా కలిపి రూ 5.5 కోట్లకు రైట్స్ అమ్ముడు పోయాయని తెలుస్తోంది.
చదవండి:మహర్షి ట్విట్టర్ రివ్యూ ! అంచనాలని అందుకుందా!
అటు నైజాం, ఓవర్సీస్ కలిపి రూ.6 కోట్లకు అమ్ముడు అయ్యాయి. ఇక ఈ ట్రైలర్‌కు మంచి స్పందన రావడంతో చిత్రం నుంచి మరొక ట్రైలర్‌ని కూడా విడుదల చేయనున్నారని సమాచారం. భారీ బడ్జెట్ తో నిర్మితమవుతోన్న ఈ సినిమాలో రాజశేఖర్ సరసన నాయికలుగా ఆదా శర్మ .. నందిత శ్వేత అలరించనున్నారు.








