
హైదరాబాద్: సుప్రీంకోర్టు తాజా ఆదేశాల ప్రకారం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికీ ఐదు వీవీప్యాట్ యంత్రాల్లోని స్లిప్పులను లెక్కించాల్సిన విషయం తెలిసిందే. అయితే కౌంటింగ్ సమయంలో ఆ ఐదు వీవీప్యాట్ యంత్రాల్నీ ఒకేసారి లెక్కించరని తెలుస్తోంది.
వీవీప్యాట్ స్లిప్పులని విడివిడిగా లెక్కిస్తామని ఎన్నికల అధికారులు అంటున్నారు. మామూలుగా ఒక్క వీవీప్యాట్ యంత్రంలో స్లిప్పులు లెక్కించడానికి గంట పైనే సమయం పడుతుంది.
చదవండి: టీడీపీ నేత సొంత సర్వే: దిమ్మతిరిగే ఫలితాలు! ఏ పార్టీకి ఎన్ని సీట్లో చూడండి…
ఇక ఆ లెక్కన వేసుకుంటే ఐదు యంత్రాల్లో స్లిప్పులు లెక్కించడానికి సుమారు 5 గంటల కంటే ఎక్కువ సమయమే పడుతుంది. దాని బట్టి చూస్తే అసలు ఫలితం వెలువడటానికి ఆలస్యం అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.
ఇక వీవీప్యాట్, ఈవీఎంలలో ఓట్లు సమానంగా ఉంటే పర్లేదు. లేదంటే మళ్ళీ లెక్కిస్తారు. ఒక్క ఓటు తేడా వచ్చినా మళ్లీ లెక్కించాల్సిందే. అంతా కరెక్టుగా ఉంటేనే ఫలితం వెల్లడిస్తారట. లేదంటే రెండూ ఈవీఎం, వీవీప్యాట్‌లు సమానంగా వచ్చేవరకు లెక్కిస్తూనే ఉంటారట.
ఒకవేళ ఎన్నిసార్లు లెక్కపెట్టినా సరిపోలకపోతే… చివరకు వీవీప్యాట్‌లో వచ్చిన స్లిప్పుల ఆధారంగానే ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయో ప్రకటిస్తామని అధికారులు చెబుతున్నారు. మొత్తం మీద ఎప్పటిలా కాకుండా ఈ సారి ఎన్నికల ఫలితం ఆలస్యం అవుతుంది.








