22.7 C
Hyderabad
Thursday, November 26, 2026
- Advertisement -
Home వార్తలు జాతీయం సామాన్యుడుకి స్టాండింగ్ ఒవేషన్: కేంద్ర మంత్రిగా ప్రతాప్ సారంగి ప్రమాణం

సామాన్యుడుకి స్టాండింగ్ ఒవేషన్: కేంద్ర మంత్రిగా ప్రతాప్ సారంగి ప్రమాణం

- Advertisement -

ఢిల్లీ: ఇటీవల వెలువడిన లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో అతి సామాన్యంగా జీవించే ప్రతాప్ సారంగి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. ఒడిశా బాలాసోర్ పార్లమెంట్ నుంచి బీజేపీ అభ్యర్ధిగా బరిలో దిగిన ప్రతాప్…బిలియనీర్ బీజేడీ అభ్యర్ధి రవీంద్ర కుమార్‌పై సుమారు 13వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు.

గత ఇదే స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయిన…ప్రతాప్ రెండుసార్లు ఎమ్మెల్యేగా కూడా పని చేశారు. ఎన్నికల్లో ఒక్క పైసా ఖర్చు చేయకుండా సారంగి గెలిచారు. ఎంత దూరమైన ఆయన సైకిల్ మీద వెళతారు. ఒక ఎదురుబొంగులతో నిర్మితమైన ఇంట్లో సాదాసీదాగా నివసిస్తున్నారు.

ఇంత సాధారణమైన జీవితాన్ని గడుపుతున్న ప్రతాప్‌కి అరుదైన గౌరవం దక్కింది. మోడీ కేబినెట్‌లో ప్రతాప్‌ మంత్రి పదవి దక్కించుకున్నారు. ఇక నిన్న ప్రతాప్ ప్రమాణస్వీకారం సందర్బంగా..  పలువురు ప్రముఖులు, కార్యక్రమానికి హాజరైన వారు అందరూ స్టాండింగ్ ఒవేషన్‌తో ఆయనకు స్వాగతం పలికారు. మొత్తానికి సామాన్యుడుకి సరైన గౌరవం దక్కింది.

చదవండి: రెండోసారి భారతదేశ ప్రధానిగా మోడీ ప్రమాణం..
- Advertisement -