నేటి నుంచి లోక్‌సభ సమావేశాలు..ప్రోటెం స్పీకర్‌గా వీరేంద్ర కుమార్..

- Advertisement -

ఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇక ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్ట మొదటి లోక్‌సభ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి.

సభలో ప్రోటెం స్పీకర్‌గా బీజేపీ ఎంపీ వీరేంద్రకుమార్‌ వ్యవహరించనున్నారు. తొలుత ఉదయం 10 గంటలకు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అనంతరం 11 గంటలకు పార్లమెంటు సమావేశాలు ప్రారంభం అవుతాయి.

తర్వాత కొత్త సభ్యులతో ప్రొటెం స్పీకర్ వీరేంద్రకుమార్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. నేడు, రేపు రెండు రోజులపాటు ఈ ప్రక్రియ కొనసాగనుంది. మొదట  ప్రధాని మోడీ, కేబినెట్‌ మంత్రులు, ప్యానల్‌ ఛైర్మన్లు ఎంపీలుగా ప్రమాణం చేస్తారు.

తర్వాత ఆంగ్ల అక్షరమాల వరుస క్రమంలో ఎంపీలు ప్రమాణ స్వీకారం చేస్తారు. తొలుత అండమాన్ నికోబార్ ఎంపీ ప్రమాణ స్వీకారం చేయనుండగా ఆ తర్వాత ఏపీ ఎంపీలు చేయనున్నారు.

చదవండి: తెలుగుదేశం నేత కి షాక్ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం!
- Advertisement -