కాళేశ్వరం ప్రారంభోత్సవానికి జగన్‌… నేడు అమరావతికి కేసీఆర్….

7:59 am, Mon, 17 June 19

అమరావతి: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్‌ని ఆహావ్నించనున్నారు.  ఇప్పటికే పలువురు ప్రముఖ నేతలనీ ఆహ్వానించిన కేసీఆర్…నేడు కేసీఆర్ ఏపీ సీఎం జగన్‌ను ఆహ్వానించేందుకు అమరావతి వెళ్లనున్నారు.

విమానంలో మధ్యాహ్నం 12:50 గంటలకు గన్నవరం చేరుకోనున్న కేసీఆర్ విజయవాడలోని గేట్‌వే హోటల్‌లో కాసేపు విశ్రాంతి తీసుకుంటారు. ఆ తర్వాత కనకదుర్గని దర్శించుకుని.. 2:30 గంటలకు తాడేపల్లిలోని జగన్ నివాసానికి వెళ్లి భేటీ అవుతారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఆహ్వానిస్తారు.

ఇక అక్కడే భోజనం చేసి  సాయంత్రం 5 గంటలకు గణపతి సచ్చిదానంద ఆశ్రమానికి వెళ్లి శారదాపీఠం ఉత్తరాధికారి దీక్షా స్వీకరణ కార్యక్రమానికి హాజరవుతారు. అనంతరం రాత్రి హైదరాబాదుకు చేరుకుంటారు.

ఇదిలా ఉంటే తెలుగు సీఎంలు కేసీఆర్, జగన్ తండ్రీకొడుకుల మాదిరిగా ఉండడం కాదు, రెండు రాష్ట్రాల మధ్య సమస్యలు కూడా పరిష్కరించుకోవాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూచించారు. ఏపీకి ప్రత్యేక హోదా అంశం ముగిసిన అధ్యాయం అని, అయితే, విభజన హామీల పరిష్కారానికి తనవంతు సహకారం అందిస్తానని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.

చదవండి: చంద్రబాబుకు తనిఖీలపై టీడీపీ ఆగ్రహం.. అర్ధనగ్నంగా నిరసనకు దిగన ఎమ్మెల్యేలు!