ఎట్టకేలకు జమ్ముకశ్మీర్‌లో ఆంక్షలు ఎత్తేసిన కేంద్రం

12:14 pm, Fri, 13 September 19

జమ్ముకశ్మీర్: జమ్ముకశ్మీర్‌లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఆంక్షలు విధించిన కేంద్రం.. తాజాగా వాటిని ఎత్తివేసింది. ఈ మేరకు సమాచార, పౌర సంబంధాల అధికారులు ప్రకటించారు.

ల్యాండ్ లైన్ ఫోన్ సేవలను పునరుద్ధరించారు. కుప్వారా, హంద్వారాలో కూడా మొబైల్ ఫోన్ నెట్‌వర్క్‌లు అందుబాటులోకి వచ్చాయి. అన్ని ప్రాంతాల్లోనూ ఆంక్షలను ఎత్తివేశామని పేర్కొన్నారు.

ఆంక్షల ఎత్తివేతతో ప్రజలు బయటకి వస్తండడంతో రోడ్లు మళ్లీ కళకళలాడుతున్నాయి. జమ్ముకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత రాష్ట్రంలో ఆంక్షలు విధించిన ప్రభుత్వం 39 రోజుల తర్వాత వాటిని ఎత్తివేసింది.