టీడీపీకి వరుస దెబ్బలు.. ‘ఫ్యాన్’ కిందికి తోట త్రిమూర్తులు?

12:23 pm, Fri, 13 September 19

రాజమండ్రి: ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీకి వరుస దెబ్బలు తప్పేలా కనిపించడం లేదు. తూర్పు గోదావరి జిల్లా సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు టీడీపీకి గుడ్ బై చెప్పడం దాదాపు ఖాయమైందన్న వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ నెల 18న ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో వైసీపీలో చేరాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఆయనతోపాటు టీడీపీకి చెందిన ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు కూడా వైసీపీలో చేరాలని నిర్ణయించినట్టు సమాచారం.

త్రిమూర్తులు చేరికకు సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ వార్తలపై తోట త్రిమూర్తులు ఇప్పటి వరకు స్పందించలేదు.