గణేశ్ నిమజ్జనంలో అపశ్రుతి.. బోటు బోల్తాపడి 11 మంది మృతి

12:32 pm, Fri, 13 September 19

భోపాల్: మధ్యప్రదేశ్‌లో ఈ ఉదయం జరిగిన గణేశ్ నిమజ్జన వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. భోపాల్‌లోని ఖట్లాపూర్‌లోని ఘాట్ వద్ద ఈ ఉదయం గణేశ్ విగ్రహాలను నిమజ్జనం చేస్తున్న సమయంలో బోటు బోల్తా పడింది.

ఈ ఘటనలో 11 మంది మృతిచెందగా, మరో ఐదుగురు గల్లంతయ్యారు. ప్రమాదం జరిగిన వెంటనే రంగంలోకి దిగిన సహాయక బృందాలు 11 మృతదేహాలను వెలికి తీశాయి.

గల్లంతైన వారి కోసం గాలిస్తున్నారు. పరిమితికి మించి ఎక్కడం వల్లే బోటు బోల్తాపడినట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై మధ్యప్రదేశ్ మంత్రి పీసీ శర్మ ఆవేదన వ్యక్తం చేశారు.

మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరపున రూ.4లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. సంఘటనా స్థలం ఆయన సహాయచర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు మంత్రి తెలిపారు