
చెన్నై: బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకి వ్యతిరేకంగా తెలంగాణ సీఎం కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేసే పనిలో బిజీగా ఉన్నారు. ఇటీవల కేరళ సీఎం పినరయి విజయన్‌తో సమావేశమై ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై చర్చించిన కేసీఆర్….నేడు డీఎంకె అధ్యక్షుడు స్టాలిన్‌తో భేటీ కానున్నారు.
ఈ నెల 23 తరువాత కేంద్రంలో ఏర్పాటు కాబోయే ప్రభుత్వంలో ప్రాంతీయ పార్టీలు కీలకపాత్ర పోషించాలని.. తమ వద్దకే జాతీయపార్టీలు వచ్చేలా అందరం కలిసి ముందుకువెళ్దామని ఈ సందర్భంగా కేసీఆర్ స్టాలిన్‌కి వివరించనున్నారని తెలుస్తోంది.
చదవండి: రజనీ రాజకీయ అరంగ్రేటం జరిగేది అప్పుడే…!
అప్పుడు కుదరలేదు….
కాగా, ఐదు రోజుల క్రితమే కేసీఆర్ స్టాలిన్‌తో భేటీ కావాలనుకున్నారు. కానీ చివరి నిమిషంలో వీరిరువురి భేటీ రద్దైనట్లు వార్తలొచ్చాయి. స్టాలిన్ కాంగ్రెస్ కూటమితో కలిసి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.
అందువల్ల ఇప్పుడు కేసీఆర్‌తో భేటీ అయితే తప్పుడు సంకేతాలు వెలువడే అవకాశాలున్నాయి కాబట్టి స్టాలిన్ ఈ భేటీని రద్దు చేసుకున్నట్లు వార్తలొచ్చాయి. కానీ కేసీఆర్ సైతం కాంగ్రెస్ వైపు చూస్తున్నారని వార్తలు వస్తూండటంతో వీరిరువురి భేటీ ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకుంది.








