రామ్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన పూరి !

ismart shankar teaser
- Advertisement -

హైదరాబాద్: ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కాంబినేషన్లో వస్తున్న తొలి చిత్రం ఇస్మార్ట్ శంకర్. శ్రీమ‌తి లావ‌ణ్య స‌మ‌ర్ప‌ణ‌లో పూరి జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్‌, పూరి క‌నెక్ట్స్ బ్యాన‌ర్స్‌పై పూరి జ‌గ‌న్నాథ్‌, ఛార్మి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సినిమా టాకీ పార్ట్ పూర్తయిన సందర్భంగా పూరి ఓ వీడియో విడుదల చేశారు.

ఇస్మార్ట్ శంకర్ అప్డేట్స్ చెబుదామని వచ్చాను నేను.. ఈ రోజుతో టాకీ పార్ట్ మొత్తం అయిపోయింది. నాలుగు సాంగ్స్ చిత్రీకరణ మిగిలి ఉంది. మణిశర్మ గారు చాలా మంచి పాటలు ఇచ్చారు. మే 15న రామ్ బర్త్ డే స్పెషల్‌గా టీజర్ రిలీజ్ చేస్తున్నాం. అందులో ఎనర్జిటిక్ రామ్‍‌ను చూస్తారు. త్వరలోనే రిలీజ్ డేట్‌తో వస్తాను.’ అంటూ పూరి పేర్కొన్నారు.

ఇప్పటికే పాటల చిత్రీకరణ కోసం ఇప్పటికే చిత్ర బృందం పాటల చిత్రీకరణ కోసం విదేశాలకు వెళ్లాల్సి ఉండగా… హీరోయిన్ నిధి అగర్వాల్ పాస్ పోర్ట్ పోగొట్టుకోవడంతో ఫారినప్ షెడ్యూల్ కాస్త ఆసల్యం అయినట్లు తెలుస్తోంది. త్వరలో రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు. రామ్ సరసన నిధి అగ‌ర్వాల్‌, న‌భా న‌టేష్‌ హీరోయిన్లుగా నటిస్తున్నరు.

- Advertisement -