
- Advertisement -
రాంచీ: జార్ఖండ్‌లో జేఎంఎం-కాంగ్రెస్-ఆర్జేడీ కూటమి మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుంది. మొత్తం 81 స్థానాలకుగాను ప్రభుత్వ ఏర్పాటకు అవసరమైన మెజారిటీ (41) స్థానాలను కూటమి అధిగమించింది.
47 స్థానాల్లో (ఆధిక్యం+విజయం)సాధించింది. భారతీయ జనతా పార్టీ 25 స్థానాలకే పరిమితమైంది. మరోవైపు జేవీఎం 3, ఏజేఎస్‌యూ 2 స్థానాల్లో గెలుపొందారు. ముఖ్యమంత్రి రఘబర్‌దాస్‌తోపాటు ఆయన కేబినెట్‌లో ఉన్న ఆరుగురు మంత్రులు, స్పీకర్ ఓటమి పాలయ్యారు.
జేఎంఎం వర్కింగ్ ప్రెసిడెంట్, సీఎం అభ్యర్థి హేమంత్ సోరెన్ పోటీ చేసిన రెండు స్థానాల్లో విజయం సాధించారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు హేమంత్ సోరెన్ సిద్ధమవుతున్నారు.
- Advertisement -








