బీజేపీకి జేడీయూ షాక్: బీహార్‌లోనే దోస్తీ…..

- Advertisement -

పాట్నా: ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో బీహార్‌లో బీజేపీ-జేడీయూ-ఎల్జేపీ పార్టీలు కలిసి కూటమిగా పోటీచేసిన విషయం తెలిసిందే. మొత్తం 40 స్థానాల్లో బీజేపీ 17, జేడీయూ 16, ఎల్జేపీ 6 స్థానాల్లో విజయం సాధించాయి. ఇక కాంగ్రెస్ ఒక స్థానంలో గెలిచింది.

అయితే బీజేపీ…కేంద్ర కేబినెట్‌లో జేడీయూకి ఒకే ఒక్క మంత్రి పదవి కేటాయిస్తామనడంతో బీహార్ సీఎం, ఆ పార్టీ అధినేత నితీష్ కుమార్ అలకబూనారు. అసలు ఆ మంత్రి పదవి కూడా వద్దని చెప్పేసి…ఎన్డీయేకి దూరం జరిగారు.

ఈ క్రమంలోనే తాజాగా జేడీయూ సంచలన నిర్ణయం తీసుకుంది. బీజేపీతో దోస్తీ బీహార్ వరకే పరిమితమని..బీహార్ బయట ఎవరి దారి వారిదేనని స్పష్టంచేసింది. ఇక నుంచి జేడీయూ బీహార్ బయట ఎన్డీయే భాగస్వామి కాదని జేడీయూ నేత కేసీ త్యాగి తేల్చి చెప్పేశారు.

అలాగే రాబోయే నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగుతామని, తమ శక్తి మేర ఢిల్లీ, హర్యానా, జార్ఖండ్, జమ్మూకాశ్మీర్ ఎన్నికల్లో సొంతంగానే పోటీచేస్తామని చెప్పుకొచ్చారు.

చదవండి: ప్రతిపక్ష హోదా కావాలంటున్న అసదుద్దీన్…
- Advertisement -