23.2 C
Hyderabad
Saturday, November 28, 2026
- Advertisement -
Home వార్తలు జాతీయం ‘పీకే’కు షాక్! బహిష్కరణ వేటు వేసిన జేడీయూ అధిష్ఠానం, ఎందుకంటే…

‘పీకే’కు షాక్! బహిష్కరణ వేటు వేసిన జేడీయూ అధిష్ఠానం, ఎందుకంటే…

- Advertisement -

పాట్నా: ప్రముఖ పొలిటికల్ వ్యూహకర్త, జేడీయూ జాతీయ ఉపాధ్యక్షుడు ప్రశాంత్‌ కిషోర్‌పై వేటు పడింది. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), జాతీయ జనాభా రిజిస్టర్‌(ఎన్‌పీఆర్‌) విషయంలో పార్టీ వైఖరికి విరుద్ధంగా వ్యవహరించాడంటూ అధిష్ఠానం ఆయనపై వేటు వేసింది. సీఏఏ, ఎన్‌పీఆర్‌లను వ్యతిరేకిస్తున్న కిషోర్‌… ఈ విషయంలో పార్టీ వైఖరిని తప్పుబడుతున్నారు.

నితీశ్‌ ఈ రెండింటికీ మద్దతివ్వటాన్ని ప్రశాంత్‌తో పాటు జేడీ (యూ) ప్రధాన కార్యదర్శి పవన్‌‌వర్మ విమర్శించారు. దీంతో వర్మ చేసిన విమర్శలకు మద్దతుగా ప్రశాంత్ ట్వీట్ చేశారు. అంతేకాదు, ఈ రెండింటికీ వ్యతిరేకంగా విపక్షాలు ఒక్కటవ్వాలని పిలుపునిచ్చారు.

చదవండి: పవన్‌ కళ్యాణ్‌కు షాక్.. జనసేనకు జేడీ లక్ష్మీనారాయణ గుడ్ బై!

దీంతో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిద్దరినీ బహిష్కరిస్తున్నట్లు జేడీయూ ప్రకటించింది. ఇకనుంచి వారిద్దరికీ పార్టీతో ఎటువంటి సంబంధం లేదని పార్టీ వ్యాఖ్యానించింది.

వీరి బహిష్కరణ తక్షణమే అమల్లోకి వస్తుందని జేడీయూ ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రశాంత్ కిశోర్ పార్టీలో ఉన్నా, వెళ్లినా పర్వాలేదని నితీశ్ వ్యాఖ్యానించారు. కిషోర్ వివిధ పార్టీలకు వ్యూహకర్తగా పనిచేశారని పేర్కొన్నారు.

 ‘‘నేను ఒక విషయం స్పష్టం చేయాలనుకుంటున్నాను, అతను పార్టీలో కొనసాగాలని కోరుకుంటే పార్టీ ప్రాథమిక నిర్మాణానికి కట్టుబడి ఉండాలి.. ప్రశాంత్‌ను పార్టీలో చేర్చుకోవాలని అమిత్‌షా నాకు చెప్పారు… ఆయన మనసులో ఏదో ఉండి ఉండాలి అని అన్నారు. 2018లో, కిషోర్‌ను జాతీయ ఉపాధ్యక్షుడిగా నియమించాం. ప్రశాంత్ పార్టీలో ఉండాలనుకుంటే ఉండొచ్చు.. బయటికెళ్లాలనుకుంటే వెళ్లొచ్చు, ఇక నిర్ణయం ఆయనదే..’’ అని నితీశ్ చెప్పారు.

చదవండి: బీ కేర్‌ఫుల్: రేపట్నించి వరుసగా మూడ్రోజులు.. బ్యాంకులు క్లోజ్!
- Advertisement -