23.3 C
Hyderabad
Thursday, November 5, 2026
- Advertisement -
Home వార్తలు జాతీయం నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్ఎల్‌వీ సి-46

నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్ఎల్‌వీ సి-46

- Advertisement -

శ్రీహరికోట: భారత అంతరిక్ష ప్రయోగ సంస్థ – ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మరో ప్రయోగం విజయవంతమైంది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్‌ కేంద్రం నుంచి ఈ ఉదయం 5.30కి పి‌ఎస్‌ఎల్‌వి-సి46 రాకెట్ ద్వారా రీశాట్-2బీ ఉపగ్రహాన్ని నింగిలోకి పంపి… కక్ష్యలో ప్రవేశపెట్టింది.

ఇక 615 కేజీల బరువున్న రీశాట్-2బీ… అత్యంత ఆధునిక రాడార్‌ ఇమేజింగ్‌ భూ పరిశీలనా ఉపగ్రహం. ఈ తరహా రాకెట్‌ను ఇస్రో ప్రయోగించడం ఇది 14వసారి. ఇందులో నాలుగు దశలున్నాయి. 1, 3 దశల్లో మోటార్లు ఘన ఇంధనంతో, 2, 4 దశల్లోని మోటార్లు ద్రవ ఇంధనంతో పనిచేస్తాయి.

ఇందులో ఏర్పాటు చేసిన ఎక్స్‌బాండ్‌ రాడార్‌ దేశ సరిహద్దులపై అనుక్షణం కన్నేస్తూ ఉగ్రవాద శిబిరాలు, వాది కదలికలను పసిగట్టి ఫొటోలు పంపిస్తుంది.  అలాగే దేశంలోని వ్యవసాయ, అటవీ రంగాల సమాచారంతోపాటు ప్రకృతి విపత్తుల సమయంలో ఉపయోగపడనుంది.

అయితే దీనిలో ఇంకో విశేషం ఏమిటంటే…..ఇది మేఘాలు ఉన్నా అన్ని వేళలా స్పష్టమైన ఫొటోలు తీసిపంపగలదు. అలాంటి లేటెస్ట్ టెక్నాలజీని ఇందులో ఉపయోగించారు.

కాగా, భారతీయులు గర్వంగా చెప్పుకునే చంద్రయాన్-2కి ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. జూలై 9 నుంచి 16లోపు చంద్రయాన్‌-2 ప్రయోగం ఉంటుందని ఇస్రో చైర్మన్ శివన్ తెలిపారు.

చదవండి:  ఏపీకి తుపాన్ల శాపం! వరుణ దేవా.. మా రాష్ట్రంపై ఎందుకీ పగ?
- Advertisement -