26.4 C
Hyderabad
Sunday, September 20, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ ఫలితాల టెన్షన్: దేవినేని ఉమా,కేశినేని నాని బీపీ నార్మల్‌…!

ఫలితాల టెన్షన్: దేవినేని ఉమా,కేశినేని నాని బీపీ నార్మల్‌…!

AP Election Latest News, Devineni Uma News, AP Political News, Newsxpressonline
- Advertisement -

విజయవాడ: కరెక్ట్‌గా 24 గంటలు….అన్నీ పార్టీల భవిష్యత్ తేలనుంది. అయితే గంటకి గంటకి ఫలితాల విషయంలో నేతల్లో టెన్షన్ పెరిగిపోతుంది.  ఇటు ప్రజలు కూడా ఎవరు గెలుస్తారో, ఎవరు ఓటమి పాలవుతారోనన్న దానిపై నరాలు తెగే ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు.

అయితే ఇంత ఉత్కంఠ నెలకొన్న సమయంలో టీవీ9 మీడియా..రాజకీయ రాజధాని విజయవాడలోని ఇద్దరు టీడీపీ నేతల బీపీని చెక్ చేసింది. ముందుగా ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న తరుణంలో మీడియా విజయవాడ టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని నానిని కలిసింది.

ఇక గెలుపుపై ధీమాతో ఉన్న కేశినేని నాని బీపీ లెవెల్స్ ఎలా ఉన్నాయో బీపీ మిషన్ తో చెక్ చేసింది. అయితే ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండా ఉన్న నాని బీపీ నార్మల్ గానే ఉంది.

ఆ తర్వాత మైలవరం టీడీపీ అభ్యర్థి దేవినేని ఉమ బీపీ లెవెల్స్ చెక్ చేయగా నార్మల్ గానే ఉన్నాయి.
ఈ సందర్భంగా కేశినేని నాని మాట్లాడుతూ… విజయవాడ చరిత్రలో ఎప్పుడూ రానటువంటి, కనీవినీ ఎరుగని మెజార్టీతో, తాను విజయం సాధించబోతున్నానని చెప్పారు.

చదవండిఅక్కడ నీ వల్ల పందేలు కాసి సర్వ నాశనం అయిపోయారు: లగడపాటిపై మంత్రి అయ్యన్న…
- Advertisement -