- Advertisement -
బ్యాంకాక్: థాయ్‌లాండ్ పర్యటనకు వెళ్లిన ఓ భారతీయుడు(42) అక్కడ జరిగిన కాల్పుల్లో మరణించాడు. మరో భారతీయుడు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్ నగరంలో సోమవారం చోటుచేసుకుంది.
బ్యాంకాక్‌లోని సెంటారా వాటర్‌గేట్ పెవిలియన్ షాపింగ్ మాల్‌లో టీనేజీ కుర్రాళ్ల గ్రూపుల మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఏకే-47 తుపాకులు కూడా ఉపయోగించినట్లు తేలిందని మెట్రోపాలిటన్ పోలీసు కమాండర్ మేజర్ జనరల్ సమ్రన్ సమ్రుట్విక్ తెలిపారు.
ఓ క్లబ్ లోపలి నుంచి ఈ గ్రూపులు బయటికి కాల్పులకు తెగబడ్డాయని, ఈ ఘటనలో మరో ముగ్గురు థాయ్ వాసులు కూడా తీవ్రంగా గాయపడ్డారని, భారత్‌కు చెందిన మృతుడు థాయ్‌లాండ్ పర్యాటనకు వచ్చాడని పోలీసులు పేర్కొన్నారు. మృతుడి పేరు ధీరజ్ అని, అతడికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని వారు తెలిపారు.
- Advertisement -