
- Advertisement -

విశాఖపట్నం: మళ్ళీ స్వైన్‌ప్లూ మహమ్మారి విశాఖపట్నంలో కనిపించింది. ఇప్పటికే ఈ వైరస్ ముగ్గురికి సోకినట్లు నిర్ధారణ అయింది. వీరిలో 15 సంవత్సరాల బాలిక ప్రస్తుతం నగరంలోని ఛాతీ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటోంది. మరో ఇద్దరు నగరంలోని కార్పొరేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. స్వైన్ ప్లూ బాధితుల్లో ఒక ఐపీఎస్ అధికారి కూడా ఉన్నట్లు సమాచారం.
స్వైన్ ప్లూ ఉందా అని అనుమానంతో ముగ్గురికీ కేజీహెచ్ వైరాలజీ ప్రయోగశాలలో నిర్ధారణ పరీక్షలు చేయగా వారికి స్వైన్‌ప్లూ ఉన్నట్లు వెల్లడి అయింది. ముగ్గురికి ఐదు రోజులుగా జ్వరం ఉందని, కానీ వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్య వర్గాలు తెలిపాయి. వారిలో జ్వరం తీవ్రత కూడా తగ్గుముఖం పడుతోందని వైద్యులు వివరించారు.
- Advertisement -








