25.2 C
Hyderabad
Friday, November 6, 2026
- Advertisement -
Home వార్తలు జాతీయం భారత్ మెరుపు దాడులు: పాక్ ఉగ్ర స్థావరాలు సర్వనాశనం

భారత్ మెరుపు దాడులు: పాక్ ఉగ్ర స్థావరాలు సర్వనాశనం

mig
- Advertisement -

శ్రీనగర్‌‌: పుల్వామా ఉగ్రదాడికి భారత్‌ ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్థాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత వైమానిక దళం బాంబులతో విరుచుకుపడింది. సరిహద్దు నియంత్రణ రేఖ వెంబడి ఉగ్రవాద శిబిరాలపై 1000కిలోల బాంబులతో భీకర దాడి చేసింది.

భారత వైమానిక బృందం మంగళవారం తెల్లవారుజామున 3:30 గంటలకు సుమారు వెయ్యి కిలోల పేలుడు పదార్థాలతో ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేసింది. 12 మిరాజ్‌-200 జైట్‌ ఫైటర్స్‌తో ఈ దాడి చేపట్టారు. ఈ నేపథ్యంలో భారత్‌, పాక్‌ సరిహద్దులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

దాడులు వందశాతం విజయవంతం…

వైమానిక దళం చేపట్టిన ఈ దాడులు వంద శాతం విజయవంతమయ్యాయని భారత ఆర్మీ అధికారులు తెలిపారు. నిర్దేశించిన లక్ష్యం ప్రకారం దాడులు అనుకున్నట్లు జరిగాయని తెలిపారు. పుల్వామా ఉగ్రదాడి జరిగిన రెండు వారాలకు పాక్‌ ఉగ్రశిబిరాలపై భారత్‌ ప్రతీకారం తీర్చుకుంది.

ఫిబ్రవరి 14న జరిగిన పుల్వామా ఉగ్రదాడిలో 40మందికి పైగా సీఆర్పీఎఫ్‌ జవాన్లు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. యురి ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్‌ గతంలో విజయవంతంగా మెరుపుదాడులు(సర్జికల్ స్ట్రైక్స్) నిర్వహించింది. 2016 సెప్టెంబర్‌ 29న నియంత్రణ రేఖను దాటి ఏడు ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసింది.

చదవండి: పుల్వామా ఎఫెక్ట్: పాకిస్తా‌న్‌కి షాక్ ఇచ్చిన భారత్! నదీ జలాలు వెళ్లకుండా నిర్ణయం…

- Advertisement -