27.2 C
Hyderabad
Saturday, November 28, 2026
- Advertisement -
Home వార్తలు జాతీయం షాకింగ్: బాంబు దాడి నిందితుడు స్కూలు పిల్లాడు.. యూట్యూబ్‌లో చూసి గ్రనేడ్ తయారీ!

షాకింగ్: బాంబు దాడి నిందితుడు స్కూలు పిల్లాడు.. యూట్యూబ్‌లో చూసి గ్రనేడ్ తయారీ!

- Advertisement -

న్యూఢిల్లీ: జమ్మూ బాంబు దాడికి సంబంధించి విస్తుగొలిపే విషయం వెలుగులోకి వచ్చింది. గురువారం జమ్మూ బస్టాండ్ సమీపంలో బాంబు పేలుడు సంభవించిన ఘటనలో ఒకరి మృతి చెందగా, 32 మంది తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. అయితే ఈ దాడి చేసింది ఉగ్రవాది కాదని, తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థి అని నిఘా వర్గాలు గుర్తించాయి.

దక్షిణ కశ్మీర్‌లోని కుల్గాంకు చెందిన ఈ విద్యార్థిని దాడి అనంతరం ఓ చెక్ పాయింట్ వద్ద భద్రతా అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఒక పిల్లాడు ఇంత భారీ సెక్యూరిటీని తప్పించుకుని ఎలా దాడికి పాల్పడ్డాడనే కోణంలో ప్రస్తుతం పోలీసు అధికారులు విచారిస్తున్నారు.

ఈ ఘటనపై జమ్మూ ఐజీ ఎంకే సిన్హా మాట్లాడుతూ.. బాంబు దాడిలో నిందితుడైన 9వ తరగతి విద్యార్థి యూట్యూబ్ వీడియోలను చూసి గ్రనేడ్ తయారు చేశాడని, దాన్ని టిఫిన్ బాక్సులో పెట్టుకుని వచ్చి బస్టాండ్ వద్ద దాడికి పాల్పడ్డాడని తెలిపారు. జమ్మూలో ప్రశాంత వాతావరణాన్ని మత సామరస్యాన్ని దెబ్బ తీయడమే లక్ష్యంగా ఈ దాడి జరిగిందని పేర్కొన్నారు.

దాడికి పాల్పడిన నిందితుడు కుల్గాం జిల్లా హిజ్బుల్ ముజాహిదీన్ చీఫ్ ఫరూక్ అహ్మద్ భట్‌తో టచ్‌లో ఉన్నాడని, ఓ కారులో 250 కిలోమీటర్ల దూరం ప్రయాణించి మరీ జమ్మూకు చేరుకున్నాడని, ఆ పిల్లాడిని ఇక్కడికి చేర్చిన కారు డ్రైవర్ కోసం గాలిస్తున్నామని వివరించారు.

- Advertisement -