- Advertisement -
న్యూఢిల్లీ: గత రెండు రోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధర శుక్రవారం భారీగా తగ్గింది. శుక్రవారం ట్రేడింగ్‌లో పది గ్రాముల స్వచ్ఛ మైన బంగారం ధర 250 రూపాయలు తగ్గి 31,850 రూపాయలకి చేరింది. స్థానిక వ్యాపారుల నుండి బంగారానికి డిమాండ్ తగ్గడంతో పాటు అంతర్జాతీయంగా నెలకొన్న బలహీన పరిస్థితుల కారణంగా ధర తగ్గిందని బులియన్ వర్గాలు తెలియజేశాయి.
అలాగే బంగారంతోపాటే వెండి కూడా కిలోకు 100 రూపాయలు తగ్గి 39,250 రూపాయలకి చేరింది. పరిశ్రమ వర్గాల నుంచి అనుకున్న స్థాయిలో డిమాండ్ లేకపోవడంతోపాటు, నాణేల తయరీదారుల దగ్గర నుండి డిమాండ్ లేకపోవడం ఇందుకు ప్రధాన కారణం. మొత్తంగా చూస్తే.. గడిచిన రెండు రోజుల్లో బంగారం ధర 625 రూపాయలు వరకు తగ్గింది.
- Advertisement -