కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ న్యాయవాది రాంజెఠ్మలానీ కన్నుమూత

6 days ago

న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ న్యాయవాది రాం జెఠ్మలానీ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ ఉదయం తన నివాసంలో తుది శ్వాస విడిచారు.

ఆయన వయసు 95 ఏళ్లు. వృత్తి రీత్యా న్యాయవాది అయిన జెఠ్మలానీ ఎన్నో సంచలనాత్మక కేసులను వాదించారు. అటల్ బిహారీ వాజ్‌పేయి మంత్రివర్గంలో కేంద్ర న్యాయశాఖ, పట్టణాభివృద్ధిశాఖ మంత్రిగా పనిచేశారు.

బార్‌ కౌన్సిల్‌ చైర్మన్‌గానూ వ్యవహరించారు. 14 సెప్టెంబరు 1923న సిఖర్పూర్‌లో జన్మించారు. సంచలనాత్మక కేసులు వాదించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

జెఠ్మలానీ మృతిపై పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.