29.2 C
Hyderabad
Wednesday, November 4, 2026
- Advertisement -
Home వార్తలు జాతీయం నేడు తెలంగాణ సహా ఐదు రాష్టాలకు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించనున్నఈసీ

నేడు తెలంగాణ సహా ఐదు రాష్టాలకు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించనున్నఈసీ

ec cuts one hour polling time in 13 sensitive constitution in telangana
- Advertisement -

Election Commission logo

న్యూఢిల్లీ: శనివారం మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర ఎన్నికల కమిషన్ మీడియా సమావేశాన్నినిర్వహించనుంది. ఈ సమావేశంలోనే ఐదు రాష్టాల ఎన్నికల షెడ్యూల్ గురించి వివరాలు వెల్లండిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రెండు రోజులుగా అన్ని రాష్టాల ఎన్నికల అధికారులతో కేంద్ర ఎన్నికల కమిషన్ సమావేశాలు నిర్వహిస్తోంది.

శనివారం కూడా సమావేశమై, ఐదు రాష్టాల ఎన్నికలపై చర్చించనున్నారు. అనంతరం ఈ నవంబరు, డిసెంబరులో జరగబోయే రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మిజోరం శాసనసభ ఎన్నికలతోపాటు తెలంగాణకు కూడా ఎన్నికల షెడ్యూల్‌ని విడుదల చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.

తెలంగాణ ఓటర్ల తుది జాబితా తయారీలో సాంకేతిక సమస్యలు…

మరోవైపు కేంద్ర ఎన్నికల కమిషన్ సాంకేతిక నిపుణులు శనివారం తెలంగాణలో పర్యటించనున్నారు. తెలంగాణ ఓటర్ల జాబితా రూపొందించే క్రమంలో ఎదురౌతున్న సాంకేతిక సమస్యలను పరిశీలించనున్నారు. అక్టోబర్ 8న తెలంగాణ తుది ఓటర్ల జాబితా విడుదల చేసేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ సిద్ధమైంది.

మరోవైపు ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులపై కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి వేసిన పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్డు… తెలంగాణ ఓటర్ల తుది జాబితాను తమ అనుమతి లేకుండా ప్రచురించరాదని ఎన్నికల కమిషన్‌‌కు ఆదేశాలు జారీ చేసింది.  పిటిషనర్ లేవనెత్తిన అంశాలకు వివరణ ఇవ్వాలంటూ ఎన్నికల కమిషన్‌ను న్యాయస్థానం అదేశించింది.

దీంతో ఓటర్ల తుది జాబితా ప్రచురణపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఎందుకంటే, ఎన్నికల సంఘం రూపొందించిన జాబితాను మొదట హైకోర్టుకు సమర్పించాల్సి  ఉంటుంది. దాన్ని పరిశీలించిన తర్వాత హైకోర్టు వాదనలు వింటుంది.  జాబితా సమర్పించడంలో ఆలస్యమైతే విచారణను వాయిదా వేసే అవకాశం కూడా ఉంది.

- Advertisement -