22.7 C
Hyderabad
Wednesday, November 4, 2026
- Advertisement -
Home వార్తలు జాతీయం మోడీకి క్లీన్‌చిట్ ఇచ్చిన ఎన్నికల సంఘం

మోడీకి క్లీన్‌చిట్ ఇచ్చిన ఎన్నికల సంఘం

Narendra Modi Latest News, BJP Latest News, Newsxpressonline
- Advertisement -

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ ‘మిషన్ శక్తి’పై చేసిన ప్రసంగానికి భారత ఎన్నికల సంఘం క్లీన్ చిట్ ఇచ్చింది. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ మోడీ తన ప్రసంగంలో ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారా? లేదా? అనే విషయం తేల్చడానికి ఈసీ ఓ పోల్ ప్యానెల్‌ను నియమించింది. ఈ నేపథ్యంలో మోడీ ప్రసంగాన్ని పరిశీలించిన ఎన్నికల సంఘం.. ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించలేదని స్పష్టం చేసింది.

ఫిర్యాదులతో పరిశీలించిన ఎన్నికల సంఘం

అంతరిక్షంలోని శత్రుదేశాల ఉపగ్రహాలను కూల్చివేయగల శాటిలైట్ విధ్వంసక క్షిపణి(ఏశాట్)ని భారత్ బుధవారం విజయవంతంగా ప్రయోగించిన విషయం తెలిసిందే. భూమి దిగువ కక్ష్యలో 3000 కిలోమీటర్ల ఎత్తులో తిరుగుతున్న పనిచేయని ఓ ఉపగ్రహాన్ని పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన ఏశాట్ క్షిపణి 3 నిమిషాల్లో కూల్చివేసిందని ప్రధాని మోడీ జాతినుద్దేశించి ప్రసంగించారు.

ఈ వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీతోపాటు విపక్షాలు విమర్శలు చేశాయి. మోడీ ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ, కమ్యూనిస్టు పార్టీ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశాయి. ప్రకటనకు ముందు ఈసీని సంప్రదించారా? లేదా అని ప్రశ్నించారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఈసీ రంగంలోకి దిగింది. మోడీ ప్రసంగంపై ఇప్పటికే రెండు సార్లు సమావేశమైంది.

కాగా, మోడీ ప్రకటనను ప్రసారం చేసిన దూరదర్శన్ తోపాటు ఆల్ ఇండియా రేడియోలు తమ సమాధానాన్ని ఈసీకి పంపాయి. మోడీ మాట్లాడిన విషయాలను పరిశీలించేందుకు ఆల్ ఇండియా రేడియోతోపాటు దూరదర్శన్‌లో వచ్చిన ఆడియో, వీడియోను పరిశీలించారు. పరిశీలించిన అనంతరం ప్రధాని మోడీ ఎన్నికల కోడ్ ఉల్లంఘించలేదని నిర్ధారించారు. అనంతరం క్లీన్ చిట్ ఇచ్చింది ఎన్నికల సంఘం.

చదవండి: చంద్రబాబు స్టిక్కర్ బాబు ఎలా అయ్యాడో మోడీ వివరణ!

- Advertisement -