25.2 C
Hyderabad
Wednesday, November 4, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ కేసీఆర్‌కు అదే భయం, భరించలేకపోతున్నారు: చంద్రబాబు విమర్శలు

కేసీఆర్‌కు అదే భయం, భరించలేకపోతున్నారు: చంద్రబాబు విమర్శలు

Chandrababu Latest News, KCR Latest News, Political Latest news, Newsxpressonline
- Advertisement -

పశ్చిమగోదావరి: తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై మరోసారి విమర్శలు ఎక్కుపెట్టారు ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. అమరావతి అభివృద్ధి చెందితే హైదరాబాద్‌ దెబ్బతింటుందని కేసీఆర్‌ భయపడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు.
మొదట్లో అందరూ బెంగళూరు వెళ్లేవారని.. హైదరాబాద్‌ను అభివృద్ధి చేశాక అక్కడికి వచ్చారని అన్నారు.

కేసీఆర్ భరించలేకపోతున్నారు..

పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరులో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో చంద్రబాబు ప్రసంగించారు. రాజమహేంద్రవరం ఎంపీ అభ్యర్థి మాగంటి రూప, కొవ్వూరు ఎమ్మెల్యే అభ్యర్థి అనితను భారీ మెజార్టీతో గెలిపించాలని సీఎం కోరారు.

ఈ ఏడాది డిసెంబర్‌ నాటికి పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తానన్నారు. అందుకే తెలంగాణ సీఎం కేసీఆర్‌ భయపడుతున్నారని వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌ కంటే మెరుగైన నగరంగా అమరావతిని అభివృద్ధి చేస్తామని చెప్పారు.

నదుల అనుసంధానం చేస్తున్నామని.. దీంతో నీటి భద్రత లభిస్తుందని ఆయన తెలిపారు. దీన్ని భరించలేకే పోలవరానికి కేసీఆర్‌ అడ్డుపడుతున్నారని ఆరోపించారు. నాగార్జున సాగర్‌లో నీళ్లు తీసుకోకూడదని శ్రీశైలానికి అడ్డుపడుతున్నారని చంద్రబాబు విమర్శించారు.

31 కేసులుండే జగన్‌.. మనకు శాంతిభద్రతలు కల్పిస్తారా? అని చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. వైసీపీ అధికారంలోకి వస్తే ఊరికొక గూండా వచ్చి మన ఆస్తుల్ని కబ్జా చేస్తారని ఆరోపించారు. రాష్ట్రాన్ని దుర్మార్గుల చేతిలో పెడితే ఏమవుతుందో ప్రజలంతా ఒక్కసారి ఆలోచించాలని సూచించారు.

ప్రత్యేక హోదాకు మద్దతిస్తానని కేసీఆర్‌ ఎప్పుడు చెప్పారని చంద్రబాబు ప్రశ్నించారు. కేసుల కోసం లాలూచీపడి రాష్ట్రానికి అన్యాయం చేస్తే వదలబోమని జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి సీఎం చంద్రబాబు హెచ్చరించారు. ఈ ఎన్నికలు ప్రజల భవిష్యత్తును నిర్దేశిస్తాయన్నారు.

చదవండి:  మోడీకి క్లీన్‌చిట్ ఇచ్చిన ఎన్నికల సంఘం

- Advertisement -