
అనంతపురం: JC దివాకర్ రెడ్డిపై మీసం మెలేసి సంచలనం రేపిన పోలీస్ అధికారి గోరంట్ల మాధవ్ అంటే తెలియని తెలుగువారు ఉండరు. ఆయన వీరోచిత చర్య కారణంగా మాధవ్ కు రాజకీయ వర్గాల్లో కూడా మంచి ఇమేజ్ వచ్చింది.
ఈ క్రమంలో ఈమాద్యే జగన్ సమక్షంలో వైసీపీ లో చేరిన ఆయన హిందూపురం లోక్ సభ అభ్యర్థిగా పోటీచేస్తున్నాడు. అందులో బాగంగానే ప్రచారంలో బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఇలాంటి సమయంలో గోరంట్ల మాధవ్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది.
మాధవ్ తండ్రి కురుబ స్వామి అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన వయసు 85 సంవత్సరాలు. తండ్రి మరణవార్త తెలియగానే ప్రచారంలో ఉన్న గోరంట్ల మాధవ్ వెంటనే ప్రచారం నిలిపివేసి స్వగ్రామానికి బయలుదేరారు. కర్నూలు జిల్లా రుద్రవరంలో మాధవ్ తండ్రికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
తమ పార్టీ అభ్యర్థికి పితృవియోగం కలగడం పట్ల వైసీపీ పార్టీ అధినాయకత్వం సంతాపం తెలియజేసింది. వై ఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా గోరంట్ల మాధవ్ కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నాడని సమాచారం.








