దేశమంతా ఆగిన లైట్లు.. వెలిగిన దివ్యజ్యోతులు

- Advertisement -

హైద‌రాబాద్‌: క‌రోనా చీక‌ట్ల‌ను చీల్చుకుంటూ దీపాలు దేశ‌మంతా దివ్య‌జోతులు వెలిగాయి. ప్ర‌మిదలు, కొవ్వొత్తులు, టార్చ్‌లైట్లు, మొబైల్ లైట్ల రూపంలో 130 కోట్ల మంది మ‌హాసంక‌ల్పంతో ఆశాదీపాల‌ను వెలిగించారు.

క‌రోనా వైర‌స్‌తో అంధ‌కారంగా మారిన ప్ర‌పంచాన్ని మ‌ళ్లీ క్రాంతి ప‌థంలో న‌డిపేందుకు దేశ ప్ర‌జ‌లంతా ఉల్లాసంగా, ఉత్సాహాంగా దీపాలు వెలిగించారు.

కరోనాపై పోరాటానికి సంఘీభావంగా సంక‌ల్ప దీపాన్ని వెలిగించాల‌ని ప్ర‌ధాని మోదీ ఇచ్చిన పిలుపున‌కు దేశ‌మంతా ప్ర‌చండ దీప కాంతులతో స్పందించింది.

క‌రోనా దుష్ట‌శ‌క్తిని పార‌దోలేందుకు ప్ర‌జ‌లంతా రాత్రి 9 గంట‌ల‌కు 9 నిమిషాల పాటు దీపాలు వెలగించి తమ సంకల్పాన్ని చాటారు.

ప్రధాని నరేంద్రమోదీ, రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, హోంమంత్రి అమిత్ షా, ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఎమ్మెల్సీ లోకేశ్, ముఖ్యమంత్రి జగన్, కేబినెట్ మంత్రులు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఇతర మంత్రులు సహా దేశప్రజలందరూ దీపాలు వెలిగించి కరోనాపై పోరులో తమ సంకల్పం చెదిరిపోదని చాటారు. 

అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, ప్రజలు స్వచ్ఛందంగా లైట్లు ఆర్పివేసి జ్యోతులు వెలిగించి తమ సంఘీభావాన్ని తెలిపారు.

- Advertisement -