22.8 C
Hyderabad
Saturday, November 7, 2026
- Advertisement -
Home వార్తలు జాతీయం దీదీకి భయమెందుకో అర్థమైంది: బెంగాల్‌లో మమతకు మోడీ చురకలు, సభలో స్వల్ప తొక్కిసలాట

దీదీకి భయమెందుకో అర్థమైంది: బెంగాల్‌లో మమతకు మోడీ చురకలు, సభలో స్వల్ప తొక్కిసలాట

modi
- Advertisement -

modi

కోల్‌కతా: టీఎంసీ అధినేత్రి, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై ప్రధాని నరేంద్ర మోడీ విమర్శనాస్త్రాలు సంధించారు. ప్రజలు బీజేపీని ఆదరిస్తున్న తీరు చూసి మమతా బెనర్జీ భయపడుతున్నారని అన్నారు. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆయన పశ్చిమబెంగాల్‌లోని వివిధ ప్రాంతాల్లో మోడీ పర్యటించారు.

మాత్వా షెడ్యూలు కులాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభలో మోడీ ప్రసంగించారు. ‘నాకు ఇప్పుడు అర్థమైంది. మమత, ఆమె పార్టీ కార్యకర్తలు ఎందుకు అమాయక ప్రజలను చంపుతూ హింసకు పాల్పడుతున్నారో. ఎందుకంటే మీ ప్రేమ మా వైపుంది కాబట్టి’ అని మమతకు చురకలంటించారు మోడీ. శుక్రవారం బడ్జెట్‌లో రైతుల కోసం తీసుకున్న నిర్ణయాల్ని ‘చారిత్రాత్మక ముందడుగు’ అభివర్ణించారు.

స్వాతంత్ర్యం వచ్చి దశాబ్దాలు గడచినా, గత ప్రభుత్వాల చేతిలో శ్రామిక, మధ్యతరగతి ప్రజలు నిర్లక్ష్యానికి గురయ్యారని ఆయన ఆరోపించారు. బడ్జెట్‌తో తాము ప్రకటించిన కేటాయింపులు 12కోట్ల మంది సన్నకారు రైతులకు లాభం చేకూర్చనుందని ఆకాంక్షించారు. 30నుంచి 40కోట్ల మంది శ్రామికులకు, మూడు కోట్ల మధ్య తరగతి ప్రజలకు ప్రస్తుత కేటాయింపులతో లబ్ధి పొందనున్నారని వివరించారు.

స్వల్ప తొక్కిసలాట: తొందరగా ముగిసిన ప్రసంగం

మోడీ పశ్చిమబెంగాల్ పర్యటన సందర్భంగా ఉత్తర 24 పరగణాల జిల్లాలోని ఠాకూర్‌నగర్‌లో ఏర్పాటుచేసిన బహిరంగసభలో మాట్లాడారు. ఈ సభకు భారీ సంఖ్యలో బీజేపీ మద్దతుదారులు, ప్రజలు తరలివచ్చారు. అయితే మోడీ ప్రసంగిస్తుండగా వందలమంది మద్దతుదారులు వేదికకు దగ్గరగా రావాలనే ఉద్దేశంతో ఒక్కసారిగా ముందుకొచ్చారు. ఈ క్రమంలో గందరగోళ పరస్థితి ఏర్పడింది.

చదవండి:  ఇది ట్రైలర్ మాత్రమే, పిక్చర్ అభీ బాకీ హై..: బడ్జెట్‌పై ప్రధాని నరేంద్ర మోడీ

ప్రజలు తమ స్థానాల్లోనే కూర్చోవాలని, ముందుకు రావొద్దని మోడీ ఎంతగా వారించినా వారు వినలేదు. దీంతో స్వల్ప తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. ఒకే చోట జనాలు ఎక్కువగా ఉండటంతో కొందరు చిన్నారులు, మహిళలు ఊపిరాడక స్పృహతప్పి పడిపోయారు. వారిని భద్రతాసిబ్బంది సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ ఘటన నేపథ్యంలో మోడీ తన ప్రసంగాన్ని కుదించుకున్నారు. కేవలం 14 నిమిషాలే మాట్లాడి మరో ర్యాలీలో పాల్గొనాలంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటన జరగడం పట్ల అక్కడి ప్రజలకు ఆయన క్షమాపణలు చెప్పారు.

- Advertisement -