27.8 C
Hyderabad
Sunday, October 11, 2026
- Advertisement -
Home వార్తలు జాతీయం బీజేపీని అధికారానికి దూరం చేయడమే లక్ష్యం…జగన్, కేసీఆర్ వద్దకి సోనియా దూత

బీజేపీని అధికారానికి దూరం చేయడమే లక్ష్యం…జగన్, కేసీఆర్ వద్దకి సోనియా దూత

YS Jagan Updates, KCR Latest News, Congress Latest News, Newsxpressonline
- Advertisement -

ఢిల్లీ: మే 19 తో సార్వత్రిక ఎన్నికలు ముగియనున్నాయి. ఇక మే 23న అన్నీ పార్టీల భవితవ్యం తేలనుంది. అయితే 2014 ఎన్నికల మాదిరిగా ఈసారి బీజేపీ-కాంగ్రెస్ పార్టీలు సొంతంగా మ్యాజిక్ ఫిగర్‌ని దాటడం కష్టం.

కాకపోతే ప్రస్తుతం ఉన్న ట్రెండ్స్ ప్రకారం బీజేపీకి మెజారిటీ సీట్లు రావచ్చని తెలుస్తోంది. అలాగే గతంలో కంటే కొంగ్రెస్ పుంజుకుంటుందని అర్ధమవుతుంది. అయితే రెండు పార్టీలు ఇతర పార్టీలని కలుపుకుంటే గాని అధికారంలోకి రాలేవని క్లియర్ కట్‌గా తెలిసిపోతుంది.

చదవండి:  ఆ ఐదు సీట్లు కాంగ్రెస్ గెలుస్తుంది…

ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ ఓ వ్యూహాత్మక ఎత్తుగడ వేసింది. బీజేయేతర పార్టీలన్నీ తమతో కలిసి రావాలని అన్నీ పార్టీలకి లేఖలు రాసింది.  మే 23న బీజేపీయేతర, తటస్థ పార్టీలతో సమావేశం నిర్వహించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. అందులో భాగంగా తటస్థంగా ఉన్న తెలంగాణ సీఎం కేసీఆర్‌, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిలను కూడా ఈ సమావేశానికి రప్పించాలని భావిస్తోంది.

దూతగా కమల్ నాథ్

వీరిద్దరిని భేటీకి తీసుకొచ్చే బాధ్యతలను సోనియా మధ్యప్రదేశ్ సీఎం కమల్‌నాథ్‌కు అప్పగించింది. అలాగే కేసీఆర్,జగన్‌లతో పాటు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌తోనూ కమల్‌నాథ్ చర్చలు జరపనున్నారు.

ఇక కమల్‌నాథ్ పాటు ఇద్దరు ఏఐసీసీ నేతలు కూడా వీరితో భేటీలో పాల్గొంటారని సమాచారం. ఒకవేళ కాంగ్రెస్‌కు మెజారిటీ తక్కువై ప్రధాని పదవి దక్కకపోయినా సరే.. బీజేపీని మాత్రం అధికారానికి దూరం చేయాలని ఆ పార్టీ భావిస్తోంది. అయితే ఇప్పటికే వైసీపీ కాంగ్రెస్‌కి మద్ధతు ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. అలాగే టీఆర్ఎస్ కూడా మద్ధతు ఇవ్వడం కష్టం. అయితే ఫలితాలు బట్టి వీరు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

చదవండి:  ఆ కారణంతోనే జగన్ తెలంగాణలో దుకాణం సర్దేశారు! టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు
- Advertisement -