22.1 C
Hyderabad
Sunday, November 8, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ పోలింగ్ తర్వాత చంద్రబాబు మాట తీరులో మార్పు వచ్చింది: అంబటి రాంబాబు

పోలింగ్ తర్వాత చంద్రబాబు మాట తీరులో మార్పు వచ్చింది: అంబటి రాంబాబు

- Advertisement -

అమరావతి: ఏపీలో ఎన్నికలు పూర్తి అయినప్పటి నుంచి సీఎం చంద్రబాబు మాట తీరులో మార్పు వచ్చిందని వైసీపీ నేత అంబటి రాంబాబు అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఎన్నికల అయిన దగ్గర నుంచి చంద్రబాబుకి ఓటమి భయం పట్టుకుందని, అందుకే జూన్ 8 వరకు తానే ముఖ్యమంత్రి అని చెప్పిన చంద్రబాబు… ఆ తర్వాత కూడా తానే సీఎం అని చెప్పలేకపోయారని వ్యాఖ్యానించారు.

అంటే తాను ఓడిపోబోతున్నట్లు ముందే గ్రహించారని, కాబట్టే ఇలాంటి మాటలు ఆయన నోటి నుంచి వచ్చాయని అంబటి అన్నారు. ఇక చంద్రగిరిలో ఈసీ రీపోలింగ్‌కు ఆదేశించడాన్ని చంద్రబాబు తప్పుబట్టడం సరికాదని అన్నారు.

చదవండి:  చంద్రగిరిలో అర్ధరాత్రి హైడ్రామా! చెవి రెడ్డి అరెస్ట్!
అయితే ఈసీ తమ పార్టీ ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ జరిపిన తరువాతే రీపోలింగ్ నిర్వహించాలని నిర్ణయం తీసుకుందని, దీనిపై చంద్రబాబు, టీడీపీ నానా హడావుడి చేస్తోందని విమర్శలు గుప్పించారు.

అయినా చంద్రబాబు మాటలు వింటుంటే… అసలు ఎన్నికలే అప్రజాస్వామ్యం
అన్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. ఓటమి భయంతో చంద్రబాబు దిగజారి మాట్లాడుతున్నారని,  రీపోలింగ్ వల్ల ఏదో గందరగోళం జరుగుతుందని టీడీపీ చచ్చు ఆరోపణలు చేస్తోందని అంబటి రాంబాబు ధ్వజమెత్తారు.

చదవండి: ఆ కారణంతోనే జగన్ తెలంగాణలో దుకాణం సర్దేశారు! టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు
- Advertisement -