
హైదరాబాద్: టాలీవుడ్ యూత్ ఐకాన్‌గా గుర్తింపు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ మరోసారి టాప్ హీరోలకు షాక్ ఇచ్చాడు. ఏకంగా ‘బాహుబలి’ హీరోలు ప్రభాస్, రానా లనే వెనక్కి నెట్టేశాడు. దేశంలోనే నాలుగో స్థానం సంపాదించి మరోసారి తన సత్తా చాటాడు.
దేశంలోని టాప్ ఇంగ్లీష్ పత్రిక టైమ్స్ ఆఫ్ ఇండియా ఏటా మోస్ట్ డిజైరబుల్ మెన్ పేరిట సర్వే నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో గత ఏడాది ప్రభాస్, రానా దగ్గుబాటి సత్తా చాటారు. ‘బాహుబలి’ క్రేజ్‌తో ప్రభాస్ ఏకంగా దేశంలోనే సెకండ్ ప్లేస్ సాధించాడు.
చదవండి: బిగ్ బాస్ 3లో శ్రీరెడ్డి! ఇక దబిడి దిబిడే!
రానా కూడా బాహుబలి ఊపులో టాప్ టెన్‌లో ఏడో ర్యాంకులో నిలిచాడు. కానీ ఈ ఏడాది మాత్రం వీరిద్దరినీ నిరాశ పరిచింది. సెకండ్ ప్లేస్‌లో ఉన్న ప్రభాస్ ఈసారి 12 స్థానానికి పడిపోయి ఏకంగా టాప్ టెన్‌లో ప్లేస్ మిస్సయ్యాడు. ఇటు రానా దగ్గుబాటి కూడా 19వ ర్యాంకుకు పడిపోయాడు.
అయితే ఆశ్చర్యం ఏమిటంటే.. అందరి అంచనాలకు భిన్నంగా విజయ్ దేవరకొండ ఏకంగా దేశంలోనే నాలుగో ర్యాంకు సాధించి టాప్ టెన్ జాబితాలో నిలవడం. గత ఏడాది విజయ్ దేవరకొండ అసలు ఈ ‘మోస్ట్ డిజైరబుల్ మెన్’ లిస్టులోనే లేడు. ఇక మిలిగిన టాలీవుడ్ హీరోల ప్రస్తావనే ఇందులో లేకపోవడం మరో విశేషం.








