టికెట్ల జారీలో సాంకేతిక లోపం.. మెట్రోలో ఉచిత ప్రయాణం

11:19 am, Sun, 18 August 19

చెన్నై: మెట్రో ప్రయాణికులు శనివారం పండుగ చేసుకున్నారు. దాదాపు రెండున్నర గంటలపాటు చెన్నై వాసులు ఉచితంగా ప్రయాణించారు. టికెట్ల జారీలో సాంకేతిక లోపం ఏర్పడటంతో ఏం చేయాలో తోచని అధికారులు ప్రయాణికులను ఉచితంగా అనుమతించారు. సాంకేతిక లోపాన్ని సరిదిద్దడంతో రెండున్నర గంటల తర్వాత తిరిగి యథావిధిగా టికెట్లు జారీ చేశారు.

టికెట్లను జారీ చేసిన తర్వాత టోకెన్లు ఇవ్వడంలో ఇబ్బందులు తలెత్తినట్టు మెట్రో అధికారులు తెలిపారు. అయితే, ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదన్న ఉద్దేశంతో ఉచిత ప్రయాణానికి అనుమతించినట్టు పేర్కొన్నారు.

టిక్కెట్ సొమ్మును వసూలు చేసిన తర్వాత టోకెన్లను జారీ చేయడంలో సాంకేతికలోపం ఏర్పడినట్లు చెన్నై మెట్రో అధికారులు తెలిపారు. ప్రయాణికులకు ఇబ్బంది కలగకూడదన్న ఉద్దేశంతో ఉచితంగా ప్రయాణం చేయడానికి అనుమతి ఇచ్చినట్లు తెలిపారు. రెండు గంటల తర్వాత సాంకేతిక లోపాన్ని సరిదిద్ది టికెట్లను జారీ చేసినట్టు వివరించారు.

కాగా, టికెట్ల జారీలో అసౌకర్యం ఏర్పడినప్పటికీ ఉచిత ప్రయాణానికి అనుమతిచ్చిన మెట్రో అధికారులకు ప్రయాణికులు ధన్యవాదాలు తెలిపారు.