26.4 C
Hyderabad
Sunday, September 20, 2026
- Advertisement -
Home వార్తలు జాతీయం కేంద్ర మంత్రులకు పదవులు ఖరారు:ఎవరికి ఏ శాఖ దక్కిందంటే?

కేంద్ర మంత్రులకు పదవులు ఖరారు:ఎవరికి ఏ శాఖ దక్కిందంటే?

Cabinet Ministers News, Central Ministers News, Political Latest News, Newsxpressonline
- Advertisement -

ఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం కేంద్రంలో మరోసారి కొలువుదీరింది. నిన్న ప్రధానిగా మోడీ….57 మంది కేంద్ర మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. ఇందులో 24 మందికి కేబినెట్‌, 9 మందికి స్వతంత్ర హోదా, 24 మందికి సహాయ మంత్రుల హోదా కల్పించారు. ఈ నేపథ్యంలో కొత్త కేంద్ర కేబినెట్ మంత్రులకు ఈరోజు శాఖలను కేటాయించారు.

కేంద్ర మంత్రులు-శాఖలు

  1. నరేంద్ర మోడీ: ప్రధానమంత్రి. దీంతో పాటు అటామిక్ ఎనర్జీ, స్పేస్, ప్రజా ఫిర్యాదులు ఇతరులకు కేటాయించని అన్ని శాఖలు.
  2. రాజ్ నాథ్ సింగ్: రక్షణ శాఖ
  3. అమిత్ షా: హోం శాఖ
  4. నిర్మాలా సీతారామన్: ఆర్థిక శాఖ
  5. ఎస్.జయశంకర్: విదేశాంగ శాఖ
  6. నితిన్ గడ్కరీ: జాతీయ రహదారులు మరియు రోడ్డు రవాణా, చిన్న మధ్య తరగతి పరిశ్రమలు
  7. రాంవిలాస్ పాశ్వాన్: వాణిజ్య శాఖ, ఆహార మరియు పౌర సరఫరాల శాఖ
  8. నరేంద్ర సింగ్ తోమార్: వ్యవసాయం మరియు రైతుల సంక్షేమ శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ, పంచాయతీరాజ్ శాఖ
  9. రవిశంకర్ ప్రసాద్: న్యాయ శాఖ, సమాచార శాఖ, ఎలక్ట్రానిక్స్ మరియు ఐటీ శాఖ
  10. హర్ సిమ్రత్ కౌర్ బాదల్: ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ
  11. తావర్ చంద్ గెహ్లాట్: సోషల్ జస్టిస్ మరియు ఎంపవర్ మెంట్ శాఖ
  12. రమేష్ పోఖ్రియల్ నిశాంక్: మానవ వనరుల శాఖ
  13. స్మృతి ఇరానీ: మహిళా శిశు సంక్షేమ శాఖ, టైక్స్ టైల్స్ శాఖ
  14. హర్షవర్దన్: ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమ శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ, ఎర్త్ సైన్సెస్ శాఖ
  15. ప్రకాశ్ జవదేకర్: పర్యావరణం, అడవుల శాఖ, సమాచార ప్రసార శాఖ
  16. పియూష్ గోయల్: రైల్వే శాఖ, పరిశ్రమల శాఖ
  17. ధర్మేంద్ర ప్రదాన్: పెట్రోలియం మరియు సహజవాయువు శాఖ, ఉక్కు శాఖ
  18. ప్లహ్లాద్ జోషి: పార్లమెంటరీ వ్యవహారాల శాఖ, బొగ్గు శాఖ, గనుల శాఖ
  19. మహేంద్రనాథ్ పాండే: స్కిల్ డెవలప్ మెంట్ మరియు ఎంటర్ ప్రిన్యూర్ షిప్ శాఖ
  20. ముఖ్తార్ అబ్బాస్ నఖ్వి: మైనారిటీ వ్యవహారాల శాఖ
  21. సదానందగౌడ: కెమికల్స్ మరియు ఫర్టిలైజర్స్ శాఖ
  22. గజేంద్రసింగ్ షెకావత్: జలశక్తి శాఖ
  23. అరవింద్ గణపత్ సావంత్: భారీ పరిశ్రమలు
  24. గిరిరాజ్ సింగ్: డైరీ, మత్స్య, యానిమల్ హస్బెండరీ శాఖ

కేంద్ర మంత్రులు(స్వతంత్ర హోదా)-శాఖలు

  1. సంతోష్ కుమార్ గంగ్వార్: లేబర్ మరియు ఎంప్లాయ్ మెంట్ శాఖ (ఇండిపెండెంట్)
  2. ఇందర్ జిత్ సింగ్: గణాంకాల శాఖ (ఇండిపెండెంట్), ప్రణాళిక శాఖ (ఇండిపెండెంట్)
  3. శ్రీపాద్ నాయక్: ఆయుర్వేద, యోగా, నేచురోపతి, యునానీ, సిద్ద, హోమియోపతి శాఖ (ఇండిపెండెంట్), రక్షణ శాఖ సహాయమంత్రి
  4. జితేంద్ర సింగ్: ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ (ఇండిపెండెంట్), ప్రధాని కార్యాలయం సహాయ మంత్రి… ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల సయాయ మంత్రి… అటామిక్ ఎనర్జీ సహాయ మంత్రి, అంతరిక్ష శాఖ సహాయమంత్రి
  5. కిరణ్ రిజిజు: క్రీడలు, యువజన శాఖ (ఇండిపెండెంట్), మైనార్టీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి
  6. ప్రహ్లాద్ సింగ్ పటేల్: టూరిజం మరియు సాంస్కృతిక శాఖ (ఇండిపెండెంట్)
  7. రాజ్ కుమార్ సింగ్: పునరుత్పాదక శక్తి శాఖ (ఇండిపెండెంట్), స్కిల్ డెవలప్ మెంట్ మరియు ఎంటర్ ప్రిన్యూర్ షిప్ శాఖ సహాయమంత్రి
  8. హర్దీప్ సింగ్ పూరి: హౌసింగ్ మరియు అర్బర్ వ్యవహారా శాఖ (ఇండిపెండెంట్), పౌర విమానయాన శాఖ (ఇండిపెండెంట్), పరిశ్రమలు మరియు వాణిజ్య శాఖ సహాయ మంత్రి
  9. మన్షుక్ మండవీయ: షిప్పింగ్ (ఇండిపెండెంట్), కెమికల్స్ మరియు ఫర్టిలైజర్స్ సహాయ మంత్రి

కేంద్ర సహాయ మంత్రులు-శాఖలు

  1. కిషన్ రెడ్డి: హోంశాఖ సహాయ మంత్రి
  2. అశ్విని కుమార్ చౌబే: ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమ శాఖ
  3. ఫగ్గన్ సింగ్: ఉక్కు శాఖ
  4. అర్జున్ రామ్ మేఘ్ వాల్: పార్లమెంటరీ వ్యవహారాలు, భారీ పరిశ్రమలు, వాణిజ్య శాఖలు
  5. జనరల్ (మాజీ) వీకే సింగ్: జాతీయ రహదారులు, రోడ్డు రవాణా శాఖలు
  6. క్రిషన్ పాల్: సామాజిక న్యాయ శాఖ
  7. రావ్ సాహెబ్ దాదారావ్: ఆహారం మరియు పౌరసరఫరాల శాఖ
  8. పర్షోత్తమ్ రూపాల: వ్యవసాయం మరియు రైతు సంక్షేమ శాఖ
  9. రాందాస్ అథవాలే: సామాజిక న్యాయ శాఖ
  10. సాధ్వి నిరంజన్ జ్యోతి: గ్రామీణాభివృద్ధి శాఖ
  11. బాబుల్ సుప్రియో: పర్యావరణం, అడవుల శాఖ
  12. సంజీవ్ కుమార్ బల్యన్: డైరీ, మత్స్య శాఖ
  13. సంజయ్ శ్యాంరావ్: మానవవరుల శాఖ, ప్రసార శాఖ, ఎలక్ట్రానిక్స్ మరియు ఐటీ శాఖ
  14. అనురాగ్ సింగ్ ఠాకూర్: ఆర్థిక శాఖ, వాణిజ్య వ్యవహారాల శాఖ
  15. అంగడి సురేష్ చెన్నబసప్ప: రైల్వే శాఖ
  16. నిత్యానంద్ రాయ్: హోం శాఖ
  17. రతన్ లాల్ కఠారియా: జల శక్తి శాఖ, సామాజిక న్యాయ శాఖ
  18. మురళీధరన్: విదేశాంగ శాఖ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ
  19. రేణుకా సింగ్ సరుత: గిరిజన వ్యవహారాల శాఖ
  20. సోమ్ ప్రకాశ్: వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ
  21. రామేశ్వర్ తేలి: ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ
  22. ప్రతాప్ చంద్ర సారంగి: చిన్న, మధ్య తరగతి పరిశ్రమల శాఖతో పాటు డైరీ, మత్స్య శాఖ
  23. కైలాశ్ చౌదరి: వ్యవసాయం మరియు రైతు సంక్షేమ శాఖ
  24. సుశ్రీ దేవశ్రీ చౌదరి: మహిళా శిశు సంక్షేమ శాఖ
చదవండి: రెండోసారి భారతదేశ ప్రధానిగా మోడీ ప్రమాణం..
- Advertisement -