26.4 C
Hyderabad
Sunday, September 20, 2026
- Advertisement -
Home వార్తలు జాతీయం జూనియర్ ఆర్టిస్టులతో సెక్స్ రాకెట్.. డైరెక్టర్ అరెస్ట్!

జూనియర్ ఆర్టిస్టులతో సెక్స్ రాకెట్.. డైరెక్టర్ అరెస్ట్!

sex racket busted in hyderabad
- Advertisement -

ముంబై: జూనియర్ ఆర్టిస్టులతో కలిసి వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ క్యాస్టింగ్ డైరెక్టర్‌కు ముంబై పోలీసులు అరదండాలు వేశారు. వారి కథనం ప్రకారం.. నవీన్ కుమార్ ప్రేమ్‌లాల్ ఆర్య (32) అనే వ్యక్తి బాలీవుడ్‌లో క్యాస్టింగ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నాడు.

అయితే, ఈజీ మనీ కోసం అడ్డదారులు తొక్కాడు. స్నేహితులు అజయ్ శర్మ, విజయ్‌లతో కలిసి వ్యభిచార దందాకు తెరలేపాడు. సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తామని యువతులకు వలవేసి ఆపై వారితో వ్యభిచారం చేయించేవాడు.

చదవండి: హైదరాబాద్‌లో ‘సెక్స్ రాకెట్’.. ముంబై నుంచి యువతులను రప్పించి…

గత ఐదేళ్లుగా నిరాటంకంగా సాగుతున్న ఈ దందాకు పోలీసులు తాజాగా చెక్ పెట్టారు. సినిమాల్లో అవకాశాలు ఇస్తామని నమ్మించి అమ్మాయిలను మోసం చేస్తున్నట్టు ఫిర్యాదులు అందడంతో రంగంలోకి దిగిన పోలీసులు అతడి స్టైల్‌లోనే ఆటకట్టించారు.

బయటి వ్యక్తుల్లా నవీన్‌కు పోన్ చేసి అమ్మాయి కావాలంటూ అడిగారు. డీల్ ఓకే అయిన తర్వాత సినీ పరిశ్రమకు చెందిన ఇద్దరిని పంపుతున్నట్టు చెప్పాడు. అయితే, ఒక్కో మహిళకు రూ.60 వేల క్యాష్‌తోపాటు హోటల్ ఖర్చులను కూడా భరించాలని చెప్పాడు.

పోలీసులు సరేననడంతో అమ్మాయిలతో కలిసి హోటల్‌కు వచ్చిన నవీన్‌ను అక్కడే మాటువేసిన పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  

చదవండి: పబ్‌‌లో అశ్లీల నృత్యాలు.. పోలీసుల దాడి.. యువతుల అరెస్ట్
- Advertisement -