23.7 C
Hyderabad
Sunday, September 20, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌ రైలుకు తప్పిన పెను ప్రమాదం

వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌ రైలుకు తప్పిన పెను ప్రమాదం

- Advertisement -

కడప: చిత్తూరు నుంచి కాచిగూడ వెళ్తున్న వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌ రైలుకు పెను ప్రమాదం తప్పింది. రైలు కడప జిల్లాలోని ఓబులవారిపల్లె వద్దకు రాగానే పట్టా విరిగినట్టు గుర్తించి నిలిపివేశారు.

అనంతరం రైల్వే సిబ్బందికి సమాచారం అందించడంతో వారొచ్చి మరమ్మతులు చేపట్టారు. ఆ తర్వాత రైలు బయలుదేరింది. విరిగిన పట్టాను గుర్తించకుంటే పండుగ వేళ పెను ప్రమాదం జరిగి ఉండేదని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు.

మరమ్మతుల కారణంగా రైలు దాదాపు గంటపాటు నిలిచిపోయింది. మరోవైపు, ఏం జరుగుతోందో తెలియని మరికొందరు ప్రయాణికులు ఆందోళన చెందారు. 

- Advertisement -