24.7 C
Hyderabad
Sunday, November 8, 2026
- Advertisement -
Home వార్తలు జాతీయం ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. పదిమంది మావోయిస్టులు మృతి, కొనసాగుతున్న ఎదురుకాల్పులు…

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. పదిమంది మావోయిస్టులు మృతి, కొనసాగుతున్న ఎదురుకాల్పులు…

maoists bejaapur
- Advertisement -

maoists

ఛత్తీస్‌గఢ్: ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. బీజాపూర్ జిల్లా భైరాన్ ఘడ్ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో మావోయిస్టులు, పోలీసుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో సుమారు 10మంది మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. అలాగే మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని అధికారులు చెప్తున్నారు. ఘటనా స్థలం వద్ద భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు.

మావోయిస్టులకి గట్టి ఎదురుదెబ్బ…

కాగా మావోయిస్టుల మృతిని ఐజీ మోహిత్‌ గార్గ్‌ అధికారికంగా ధ్రువీకరించారు. మరోవైపు ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. మాడ్ అటవీ ప్రాంతంలో జవాన్లు కూంబింగ్‌కు వెళ్లారు. ఈ సమయంలో మావోయిస్టులు తారసపడ్డారు. లొంగిపోవాలని జవాన్లు హెచ్చరించినా వారు వినకుండా కాల్పులకు తెగబడ్డారు. ఎన్‌కౌంటర్ అనంతరం ఆ ప్రదేశానికి అదనపు బలగాలను తరలించారు. అడవిని జల్లెడ పడుతున్నారు.

ఇటీవలి కాలంలో నక్సలైట్లకు వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. తమకు తగులుతున్న ఎదురుదెబ్బల అనంతరం.. ఇటీవల ఏపీలో ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వర రావుతో పాటు మాజీ ఎమ్మెల్యేను నక్సలైట్లు చంపేశారు.

- Advertisement -