23.7 C
Hyderabad
Sunday, September 20, 2026
- Advertisement -
Home వార్తలు జాతీయం మోడీ ప్రమాణస్వీకారానికి గైర్హాజరు కానున్న జగన్, కేసీఆర్‌..

మోడీ ప్రమాణస్వీకారానికి గైర్హాజరు కానున్న జగన్, కేసీఆర్‌..

- Advertisement -

విజయవాడ: ఈరోజు సాయంత్రం 7 గంటలకు రాష్ట్రపతి భవన్లో ప్రధానిగా మోడీ ప్రమాణస్వీకార కార్యక్రమం జరగనున్న విషయం తెల్సిందే. ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల సీఎంలు జగన్, కేసీఆర్, గవర్నర్ నరసింహన్ హాజరుకావాల్సి ఉంది. అయితే ఈ ముగ్గురూ ఒకే విమానంలో వెళ్లాలని ప్లాన్ చేసుకున్నారు.

కానీ విమానం ల్యాండింగ్‌కు అనుమతి లేని కారణంగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మోడీ ప్రమాణస్వీకార కార్యక్రమానికి గైర్హాజరు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఢిల్లీలో విమానం ల్యాండింగ్‌కు అనుమతి లేని కారణంగా వీరి పర్యటనను రద్దుచేశారు.

కాగా, మోడీ ప్రమాణస్వీకారానికి దేశవిదేశాల నుంచి అతిథులు వస్తున్నారనీ, కాబట్టి ఢిల్లీలో ఎయిర్ ట్రాఫిక్ భారీగా పెరిగిపోయిందని పౌరవిమానయాన శాఖ, డీజీసీఏ అధికారులు తెలిపారు. దీంతో జగన్, కేసీఆర్‌లు ప్రయాణించే ఢిల్లీలో మధ్యాహ్నం 3.30 గంటలకే ల్యాండ్ అయ్యేలా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. అయితే విజయవాడలోనే సమయం 3 గంటలు అయిపోవడంతో జగన్ తో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన పర్యటనను రద్దుచేసుకున్నట్లు సమాచారం.

చదవండి: ఆ న్యూస్ చానల్స్‌కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన ఏపీ సీఎం…
- Advertisement -