26.4 C
Hyderabad
Sunday, September 20, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ ఆ న్యూస్ చానల్స్‌కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన ఏపీ సీఎం…

ఆ న్యూస్ చానల్స్‌కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన ఏపీ సీఎం…

AP CM Jagan Latest News, AP Updates, AP Latest News, Newsxpressonline
- Advertisement -

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రిగా ఎన్నికైన వెంటనే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి….సరికొత్త నిర్ణయాలు తీసుకుంటూ సంచలనాలు సృష్టిస్తున్నారు. ప్రతి గ్రామంలో ఓ సెక్రటేరియట్‌ని పెట్టి చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చిన ఆయన….ప్రభుత్వ పథకాల్లో ఎలాంటి అవినీతి జరగకుండా ప్రజల అందరికీ చేరువయ్యేలా చేస్తామని ప్రకటించారు.

ఈ క్రమంలోనే సీఎం జగన్ ఇంకో సరికొత్త నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో అవినీతిని రూపుమాపేందుకు రేపు లేదా ఎల్లుండి తాను ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కలుస్తానని తెలిపారు. ఓ హైకోర్టు జడ్జీని జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటుకు కేటాయించాల్సిందిగా కోరతామని వెల్లడించారు.

దీని ద్వారా ఏ కాంట్రాక్టు అయినా టెండర్లకు పోకముందే కమిషన్ ముందుకు పంపిస్తామని,  జడ్జి చేసే సూచనలు, మార్పులను తూచాతప్పకుండా పాటిస్తామని, ఆ తర్వాతే కాంట్రాక్టులను పిలిచి అవినీతి జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు.

ఇక కొన్ని మీడియా చానల్స్‌కి జగన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఏపీలో ‘ఈనాడును చూసినా, ఆంధ్రజ్యోతిని చూసినా, టీవీ5ను చూసినా.. మన ఖర్మ.. అందరం కలిసి చూస్తున్నాం. వాళ్లకు ముఖ్యమంత్రిగా ఒక్క చంద్రబాబు మాత్రమే ఇంపుగా కనిపిస్తారు. మిగతావారెవరూ ఇంపుగా కనిపించరని అన్నారు.

అయితే మిగిలినవాళ్లను ఎలా దించాలన్న రీతిలోనే వీరి రాతలు ఉంటాయని, ఈ సంస్థలన్నింటికి తను ఒక్కటే చెబుతున్నాని, మీరు పారదర్శకమైన టెండర్లపై తప్పుడు కథనాలు రాస్తే పరువునష్టం దావా దాఖలు చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. అలాగే వీరిని శిక్షించాల్సిందిగా హైకోర్టును గట్టిగా కోరతామని అన్నారు.

చదవండి: ఏపీ ప్రజలపై వరాల జల్లు కురిపించిన సీఎం జగన్…

- Advertisement -