
ముంబై: మహీంద్రా అండ్ మహీంద్రా చైర్మన్ ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో ఎంత చురుగ్గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాజాగా, ఆయన చేసిన ట్వీట్ మరోమారు వైరల్ అయింది.
కరోనా వైరస్ నేపథ్యంలో ఓ వ్యక్తి తన ప్యాసింజర్ ఆటోను వినూత్నంగా డిజైన్ చేశాడు. కరోనా వైరస్‌కు అడ్డుకట్ట వేసేందుకు ప్రస్తుతం ఉన్న ఔషధం సామాజిక దూరం మాత్రమే.
ఆటోలో పార్టిషన్…
దీంతో ఆ వ్యక్తి ప్రయాణికులు మధ్య దూరం ఉండేలా ఒకరికి ఒకరు కనిపించకుండా ఆటోను పార్టిషన్ చేశాడు. ఆటోను భాగాలుగా విడదీసి సీటింగ్ ఏర్పాటు చేశాడు.
ఇటీవల ఆ ఆటో సోషల్ మీడియాకు ఎక్కడంతో విపరీతంగా వైరల్ అయింది. అది కాస్తా ఆనంద్ మహీంద్రా దృష్టికి చేరడంతో ఆయన ఫిదా అయ్యారు. ఈ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు.
చదవండి: షాకింగ్: 267 మిలియన్ల ఫేస్‌బుక్ యూజర్ల వ్యక్తిగత సమాచారం.. ‘డార్క్ వెబ్’ చేతుల్లో!?
‘పరిస్థితులకు అనుగుణంగా మన ప్రజలు వేగంగా నూతన ఆవిష్కరణలు చేస్తున్న తీరు, వారి సామర్థ్యం నన్ను ఎప్పటికీ ఆశ్చర్యపరుస్తుంటాయి..’ అంటూ ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.
ఆ వాహనాన్ని ఇన్నోవేటివ్ ఐడియాతో రూపొందించిన వ్యక్తిని.. మన కంపెనీ ఆర్ అండ్ డీ, ప్రొడక్ట్ డెవలప్‌మెంట్ టీమ్స్‌కు సలహాదారుగా నియమించుకుందామంటూ తమ కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజేశ్‌కు ట్విట్టర్ వేదికగా సూచించారు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోను మీరూ చూడండి
The capabilities of our people to rapidly innovate & adapt to new circumstances never ceases to amaze me. @rajesh664 we need to get him as an advisor to our R&D & product development teams! pic.twitter.com/ssFZUyvMr9
— anand mahindra (@anandmahindra) April 24, 2020








