33.6 C
Hyderabad
Sunday, October 11, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ ప్రధాని ఫోన్ చేసి సలహాలు అడుగుతున్నారట, బాబు ఇంకా అదే భ్రాంతిలో..: విజయసాయి రెడ్డి ఎద్దేవా

ప్రధాని ఫోన్ చేసి సలహాలు అడుగుతున్నారట, బాబు ఇంకా అదే భ్రాంతిలో..: విజయసాయి రెడ్డి ఎద్దేవా

vijayasai-reddy-fires-on-chandra-babuin-a-latest-tweet
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ మాజీ మఖ్యమంత్రి, ప్రస్తుత ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడిపై అవకాశం దొరికినప్పుడల్లా విరుచుకుపడే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తాజాగా మరోసారి బాబును ఎద్దేవా చేశారు.

చదవండి: ఆ ఆటో డ్రైవర్‌కు ఆనంద్ మహింద్ర సూపర్ ఆఫర్!

‘‘ప్రధాని మోడీ రోజుకు నాలుగుసార్లు ఫోన్ చేసి ఈయన సలహాలు తీసుకుంటున్నాడట.. బాబు ఇంకా ఏపీకి తానే సీఎం అనే భ్రాంతిలో ఉన్నట్లున్నాడు..’’ అంటూ వ్యాఖ్యానించారు. 

ఆంధ్రప్రదేశ్‌లో సమాంతర ప్రభుత్వం నడపాలని ఒకరు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి సలహా ఇచ్చారని, ఆ వ్యక్తి ఒక వర్చువల్ రియాలిటీ గేమ్ తయారు చేయించి బాబుకు బహూకరించాడని కొందరు అంటున్నారని విజయసాయి ఆరోపించారు.

తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు… 

‘తానింకా సీఎం అయినట్టు, ప్రధాని రోజూ నాలుగు సార్లు ఫోన్ చేసి సలహాలు అడుగుతున్నట్టు భ్రాంతిలో మునిగి తేలుతున్నాడట బాబు. సమాంతర ప్రభుత్వం నడపాలని సలహా ఇచ్చినాయన ఒక వర్చువల్ రియాలిటీ గేమ్ తయారు చేయించి బాబుకు బహూకరించారని కొందరు అంటున్నారు..’ అంటూ ట్వీట్ చేశారు.

చదవండి: ‘అమ్మో’రికా: ఒక్కరోజులో దాదాపు 30 వేల పాజిటివ్ కేసులు! అమెరికాలో అసలేం జరుగుతోంది?

అంతేకాదు, రాష్ట్రాధినేత సమర్థత, సాహసోపేత నిర్ణయాలు తీసుకోగలిగే చొరవ సంక్షోభ సమయాల్లో ప్రజలను ఆపద నుంచి గట్టెక్కిస్తాయని ఆయన వ్యాఖ్యానించారు.

‘కోవిడ్19 నియంత్రణకు తక్కువ ప్రాణనష్టంతో ఏపీ దిశా నిర్దేశం చేస్తుంది. ప్రతి రాష్ట్రం మనల్ని అసుసరిస్తుంది. కేంద్రం ఇప్పటికే ప్రశంసించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఆరా తీస్తోంది..’ అంటూ విజయసాయిరెడ్డి ఆ ట్వీట్‌లో చెప్పుకొచ్చారు.

- Advertisement -