24.2 C
Hyderabad
Friday, November 27, 2026
- Advertisement -
Home వార్తలు జాతీయం వావ్.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ పోటాపోటీ.. డిస్కౌంట్ ఆఫర్లతో వినియోగదారులకు పండగే!

వావ్.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ పోటాపోటీ.. డిస్కౌంట్ ఆఫర్లతో వినియోగదారులకు పండగే!

amazon-flipkart-sale
- Advertisement -

amazon-flipkart-great-discount-sale

న్యూఢిల్లీ: ప్రముఖ ఈ-కామర్స్‌ సంస్థలు అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ తాజాగా వినియోగదారులకు భారీ డిస్కౌంట్‌తో కూడిన డీల్స్‌ను ప్రకటించాయి. ఈ నెల 20వ తేదీ నుంచి ఈ ఆఫర్లు అందుబాటులోకి రానున్నాయి. అయితే అమెజాన్‌ ప్రైమ్‌, ఫ్లిప్‌కార్ట్‌ ప్లస్‌ సభ్యులకు మాత్రం ఒకరోజు ముందుగానే అంటే ఈ నెల 19 నుంచే ఈ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి.

ఈ నెల 20 నుంచి 23 వరకు అమెజాన్‌ ‘గ్రేట్‌ ఇండియన్‌ సేల్‌’ పేరుతో డిస్కౌంట్ సేల్‌ను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా వినియోగదారులకు బోలెడు ఆఫర్లు ప్రకటించింది. అలాగే ఫ్లిప్‌కార్ట్‌ ‘రిపబ్లిక్‌ డే సేల్‌’ పేరుతో ఈనెల 20 నుంచి 22 వరకు షాపింగ్ డీల్స్‌ ప్రకటించింది.

‘గ్రేట్‌ ఇండియన్‌ సేల్‌’ భాగంగా అమెజాన్‌ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుతో ప్రత్యేకంగా ఒప్పందం చేసుకుంది. దీని ప్రకారం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కార్డుపై కొనుగోళ్లు చేసే వారికి 10 శాతం తక్షణ డిస్కౌంట్‌ లభిస్తుంది. ఇక ఫ్లిప్‌కార్ట్‌ ఎస్‌బీఐతో ఒప్పందం పెట్టుకుంది. ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డు ఉపయోగించి షాపింగ్‌ చేసే వారికి ఫ్లిప్‌కార్ట్ 10 శాతం డిస్కౌంట్‌ ఇస్తోంది.

స్మార్ట్‌ ఫోన్‌లు, ఎలక్ట్రానిక్ వస్తువులపై…

అమెజాన్, ఫ్లిప్‌కార్ట్.. రెండు సంస్థలు కూడా స్మార్ట్‌ ఫోన్‌లు, ఎలక్ట్రానిక్ వస్తువులపై భారీ డిస్కౌంట్లను ప్రకటించాయి. అంతేకాదు, కొన్ని మోడళ్లపై వడ్డీ లేకుండా నెలసరి వాయిదాల(ఈఎంఐ) చెల్లింపు పద్ధతి కూడా అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్‌.. యాపిల్ ఐ ఫోన్‌లపై భారీ డిస్కౌంట్‌లు ప్రకటించగా.. అమెజాన్‌ వన్‌ ప్లస్‌ 6టి, రెడ్‌మి వై2, హువాయ్‌ నోవె 3ఐ, హానర్‌ 8ఎక్స్‌ స్మార్ట్‌ ఫోన్‌ మోడళ్లపై భారీ డిస్కౌంట్‌లు ప్రకటించింది.

ఇక అమెజాన్‌ ఎకో ఉత్పత్తులు రూ.1,500 డిస్కౌంట్‌పై, అమెజాన్‌ ఫైర్‌ టీవీ స్టిక్‌ 25 శాతం డిస్కౌంట్‌పై లభిస్తాయి. కొన్ని ల్యాప్‌టాప్‌లు రూ.35,000 తగ్గింపుపై లభిస్తాయి. 450 రకాల హెడ్‌ ఫోన్‌లపై ఆకర్షణీయమైన తగ్గింపు, హార్డ్‌ డ్రైవ్స్‌పై 60 శాతం తగ్గింపు, నికాన్‌, క్యానన్‌, సోనీ కెమెరాలపై కనీసం రూ.5,000 తగ్గింపు లభిస్తుంది.

- Advertisement -