28.2 C
Hyderabad
Thursday, November 5, 2026
- Advertisement -
Home వార్తలు జాతీయం ఇది సోషల్ డిస్టెన్స్ బైక్.. సీఎం ప్రశంసలు అందుకున్న మెకానిక్!

ఇది సోషల్ డిస్టెన్స్ బైక్.. సీఎం ప్రశంసలు అందుకున్న మెకానిక్!

- Advertisement -

 అగర్తలా: కరోనా వైరస్ భయపెడుతున్న నేపథ్యంలో ప్రజలంతా సామాజిక దూరాన్ని పాటిస్తూ ప్రాణాంతక వైరస్‌కు దూరంగా ఉంటున్నారు.

అయితే, కొన్ని సార్లు మాత్రం ఇది అదుపుతప్పుతోంది. ఈ నేపథ్యంలో అగర్తలాకు చెందిన ఓ మెకానిక్ ‘సోషల్ డిస్టెన్సింగ్ బైక్’ను రూపొందించాడు.

స్కూ లు డ్రాపౌట్ అయిన పార్థా సాహా (39) తయారు చేసిన ఈ బైక్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఓ స్క్రాప్ డీలర్ నుంచి పాత బైక్‌ను కొనుగోలు చేసిన పార్థ దాని ఇంజిన్‌ను వేరు చేశాడు.

అనంతరం దానిని రెండు బాగాలుగా చేశాడు. ముందు టైరు, వెనక టైరుకు మధ్య 3.2 అండుగుల పొడవు ఉండే రాడ్లను అమర్చాడు. ఆ తర్వాత దానికి ఇంజిన్ అమర్చాడు.

‘‘ఇప్పుడు నేను నా ఎనిమిదేళ్ల కుమార్తెతో సామాజిక దూరం పాటిస్తూ బైక్‌పై వెళ్లగలను’’ అని పార్థ పేర్కొన్నాడు.

కరోనా వైరస్‌ను అణచివేసేందుకు ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమల్లో ఉంది. సామాజిక దూరం పాటించడం ద్వారా ఈ వైరస్‌కు దూరంగా ఉండొచ్చని ప్రభుత్వాలు, ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా 33,370 కేసులు నమోదయ్యాయి. 1,093 మంది చనిపోయారు. మే 3తో లాక్‌డౌన్ గడువు ముగిసినప్పటికీ వైరస్‌పై పోరు కొనసాగుతూనే ఉంటుందని పార్థ గ్రహించాడు.

మహమ్మారి పూర్తిగా అంతమయ్యే వరకు సామాజిక దూరం తప్పదని గ్రహించాడు. అందుకనే ఈ బైక్‌ను రూపొందించాడు.

స్కూలు ప్రారంభమైన తర్వాత తన కుమార్తెను స్కూలు బస్సులో పంపించే ఉద్దేశం తనకు లేదని, ఎందుకంటే అది కిక్కిరిసిపోయి ఉంటుందని పేర్కొన్నాడు.

తాను రూపొందించిన బైక్ బ్యాటరీ శక్తితో నడుస్తుందని, గరిష్టంగా 40 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుందని చెప్పాడు. మూడు గంటలపాటు బ్యాటరీని చార్జ్ చేస్తే 80 కిలోమీటర్లు వెళ్లొచ్చన్నాడు.

బ్యాటరీని రీచార్జ్ చేసేందుకు పది రూపాయలు ఖర్చవుతుందన్నాడు. ఇప్పటికే ఈ బైక్ వేసుకుని బయటకు వచ్చి అందరి దృష్టిని ఆకర్షించాడు.

బైక్ డిజైన్, డ్రాయింగ్ చూసి త్రిపుర ముఖ్యమంత్రి బిప్లబ్‌ కుమార్‌ దేబ్ ప్రశంసించారు. ‘అవసరం ఆవిష్కరణలకు తల్లి లాంటిది’’ అని ట్వీట్ చేస్తూ పార్థ సాహాను అభినందించారు.

- Advertisement -