
ఢిల్లీ: సోమవారం ముగిసిన 5 విడత లోక్‌సభ ఎన్నికల్లో 63.5 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 7 రాష్ట్రాల్లోని 51 లోక్‌సభ స్థానాలకి ఎన్నికలు జరిగాయి. వీటిల్లో జమ్మూ కాశ్మీర్ లో అత్యల్పంగా 17.07 ఓటింగ్ శాతం నమోదవ్వగా, అత్యధికంగా, పశ్చిమ బెంగాల్‌లో 74.42 శాతంనమోదైంది.
ఇక ఉత్తరప్రదేశ్‌లో 57.33 శాతం, బీహార్‌లో 57.86 శాతం, జార్ఖండ్‌లో 63.72 శాతం, మధ్యప్రదేశ్‌లో 63.88శాతం, రాజస్థాన్‌లో 63.78 శాతం, పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం తెలిపింది.
చదవండి: మనిషి పోయినా ఓటు పోలేదు.. స్మశానం నుండి నేరుగా పోలింగ్ బూత్‌కి….
ఏపీలో భారీగా రీపోలింగ్…
సోమవారం ఐదు కేంద్రాల్లో జరిగిన రీపోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. గుంటూరులో 2, ప్రకాశంలో 1 , నెల్లూరులో 2 కేంద్రాల్లో భారీగా పోలింగ్ శాతం నమోదైంది. గుంటూరులోని నరసరావుపేట నియోజకవర్గంలో కేసానుపల్లి పోలింగ్ కేంద్రంలో మొత్తం 89.23 శాతం పోలింగ్ నమోదుకాగా, గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని నల్లచెరువు పోలింగ్ కేంద్రంలో మొత్తం 75.4 శాతం పోలింగ్ నమోదయ్యింది.
అలాగే నెల్లూరులోని కోవూరు నియోజకవర్గంలోని ఇసుకపాలెం పోలింగ్ కేంద్రంలో 75.55 శాతం, సూళ్లూరు పేట నియోజకవర్గంలోని అటకాని తిప్ప పోలింగ్ కేంద్రంలో 83.13 శాతం, ప్రకాశం జల్లా యర్రగొండ పాలెం నియోజకవర్గంలో కలనూతల పోలింగ్ కేంద్రంలో 75.61 శాతం పోలింగ్ నమోదయ్యింది.
చదవండి: కృష్ణాలో మెజారిటీ స్థానాలు కైవసం చేసుకునేది ఏ పార్టీ అంటే?








