22.2 C
Hyderabad
Thursday, November 5, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ వైసీపీ నేతలు కాలకేయులు లాంటి వాళ్ళు: వల్లభనేని వంశీ

వైసీపీ నేతలు కాలకేయులు లాంటి వాళ్ళు: వల్లభనేని వంశీ

- Advertisement -

విజయవాడ: ఎన్నికలు ముగిసిన టీడీపీ-వైసీపీ నేతల మధ్య మాత్రం గొడవలు సద్దుమణగడం లేదు. ఎన్నికలైన దగ్గర నుంచి రాష్ట్రంలోని ఏదొక నియోజకవర్గంలో టీడీపీ-వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తూనే ఉంది. ఈ క్రమంలోనే కృష్ణా జిల్లా గన్నవరంలో టీడీపీ-వైసీపీ అభ్యర్ధుల మధ్య వివాదం తారస్థాయికి చేరుకుంది.

చదవండి: కృష్ణాలో మెజారిటీ స్థానాలు కైవసం చేసుకునేది ఏ పార్టీ అంటే?

టీడీపీ అభ్యర్ధి వల్లభనేని వంశీ, వైసీపీ అభ్యర్ధి యార్లగడ్డ వెంకట్రావులు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. ఓటమి భయంతోనే గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని యార్లగడ్డ మండిపడ్డారు. తాను డబ్బులు సంపాదించడానికి రాజకీయాల్లోకి రాలేదనీ, ప్రజా సమస్యలు పరిష్కరించడానికే వచ్చానని చెప్పారు.

‘‘మట్టి దొంగలం మేం కాదు..’’

తాము మట్టి దొంగలం కాదని, అజ్జనపూడిలో యాదవ, క్రైస్తవ సోదరుల భూములను దొంగిలించింది తాము కాదని వంశీని ఉద్దేశించి యార్లగడ్డ పరోక్ష విమర్శలు చేశారు.

ఈ క్రమంలోనే యార్లగడ్డ వ్యాఖ్యలకు వంశీ కౌంటర్ ఇచ్చారు. కల్లు తాగిన కోతిలా వెంకట్రావు మాట్లాడాడని, అందుకే, తాను మాట్లాడాల్సి వస్తోందని అన్నారు. అసలు నిన్నటి వరకూ ఈ వివాదం గురించి పెద్దగా పట్టించుకోలేదని, నియోజకవర్గంలో ఇద్దరం కలసి పనిచేద్దామని చెబుదామని అనుకున్నానని అన్నారు.

కానీ ఇప్పుడు ఆయన మాట్లాడిన భాష అభ్యంతరకరంగా ఉండటంతో తాను మళ్లీ పదేళ్లు వెనక్కి వెళ్లాల్సి వచ్చిందని అన్నారు. కొద్దిగా మత్తు దిగిన తర్వాత వెంకట్రావుకు వాస్తవ పరిస్థితి అర్థమవుతుందని చెప్పారు. వైసీపీ వాళ్లు అల్లరి మూక అని, వారి నాయకత్వమే అలా ఉంటుందని, వైసీపీ నేతలు బాహుబలి సినిమాలో కాలకేయ లాంటి వాళ్లని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

చదవండి: చంద్రబాబుకి వెన్నుపోటు పొడించింది వారేనా!?
- Advertisement -